నా భార్య చంపేస్తుందేమో: గౌతమ్ గంభీర్
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ చాలా అరుదుగా నవ్వుతుంటాడు. మైదానంలో ఉన్నా, భార్యతో గడుపుతున్నా ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తాడు. చాలామందితో విభేదాలు ఉన్నాయి.
అతడిని భార్య, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ సహా ఎవరూ మార్చలేకపోయారు.

తాజాగా, గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య తనను చంపేస్తుందేమో అన్నాడు. భార్య నటాషా గంభీర్‌ను ఎన్నోసార్లు తనతో పాటు డ్యాన్స్ చేయాలని కోరింది. వాటిని గంభీర్ లెక్కలోకి తీసుకోలేదు.
చివరికి అతడి బావమరిది బ్యాచిలర్ పార్టీ వేడుకలోనూ డ్యాన్స్ చేయలేదు. ఇది నేరంతో సమానమని అప్పుడు నటాషా అన్నదట. షారుఖ్ సైతం గంభీర్‌ను డ్యాన్స్ చేయమని కోరేవాడట. అప్పుడూ ఒప్పుకోలేదు. అలాంటిది ఓ ప్రకటన కోసం తొలిసారి గంభీర్ కాలు కదిపాడు. ఎన్నో సార్లు బతిమాలినా ఒప్పుకోని తాను ఇప్పుడు డ్యాన్స్ చేసే సరికి నటాషా తనను చంపేస్తుందేమో అని గంభీర్ ఇప్పుడు చమత్కరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications