Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం అంపైరింగ్‌?: పెద్ద పొరపాటు, వార్నర్ అలా ఎలా ఆడతాడు!

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 10వ సీజన్‌లో తరచూగా ఎంపైరింగ్‌ పొరపాట్లు, తప్పిదాలు దర్శనమిస్తున్నాయి. అంపైరింగ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంఫైర్లు గుడ్డిగా వ్యవహరించి, పెద్ద తప్పిదానికే కారణమయ్యారు.

మ్యాచ్‌ ఆరో ఓవర్‌లో అంఫైర్లు కునుకుతీస్తూ నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆరో ఓవర్‌ చివరి బంతిని ఎదుర్కోవడమే కాకుండా.. ఏడో ఓవర్‌ మొదటి బంతిని కూడా ఆడాడు. వార్నర్‌ ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కోవడాన్ని ఈ ఇద్దరితోపాటు టీవీ అంపైర్‌ కూడా గుర్తించకపోవడం ఆశ్చర్యకరం.

శిఖర్‌ ధావన్‌తో కలిసి డేవిడ్ వార్నర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జస్ప్రీత్‌ బుమ్రా ఆరో ఓవర్‌ వేశాడు. ఆరో ఓవర్‌ చివరి బంతిని వార్నర్‌ ఫోర్‌గా మలిచాడు. దీంతో నిబంధనల ప్రకారం నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న ధావన్‌ స్థానం మార్చుకొని ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కోవాలి. కానీ, అంఫైర్లు అలసత్వం వహించడంతో వార్నరే ముంబై బౌలర్‌ మెక్లీనగన్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కొని ఒక సింగిల్‌ తీశాడు.

క్రికెట్‌ నిబంధనల ప్రకారం ఓవర్‌ ముగిస్తే స్ట్రైకింగ్‌ మారాల్సి ఉంటుంది. కానీ అంఫైర్లు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో మ్యాచ్‌ అలా సాగిపోయింది. ఇదే స్టేడియంలో జరిగిన గత మ్యాచ్‌లో ఇద్దరు ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ అవుటైనట్టు నందన్‌, నితిన్‌ తప్పుడు నిర్ణయం కూడా తీసుకున్నారు.

బంతి ఎడ్జ్‌ తీసుకున్నా తనను ఎల్బీగా ప్రకటించడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ అంపైర్‌ నందన్‌పై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ రిఫరీ అతడిని మందలించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+