Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ స్పిన్నర్లే టార్గెట్‌: బెంగళూరు విజయంపై పొలార్డ్

హైదరాబాద్: కఠినమైన పరిస్థితులే మనల్ని ఛాంపియన్‌ను చేస్తాయని వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ పేర్కొన్నాడు. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పొలార్డ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఏడు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

స్కోరు కార్డు

కీరన్ పొలార్డ్(47 బంతుల్లో 70; 3ఫోర్లు, 5సిక్స్‌లు), కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 37; 3ఫోర్లు, సిక్స్) అద్భుత బ్యాటింగ్‌తో రాణించడంతో శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది.

ఐపీఎల్‌ పదిలో సీజన్‌లో ముంబై హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు లెగ్‌స్పిన్నర్ శామ్యూల్ బద్రీ ధాటికి ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పార్థివ్ పటేల్ (3), మెక్‌క్లీగన్ (0), రోహిత్(0)ల రూపంలో 7 పరుగులకే 4 వికెట్లు వికెట్లు కోల్పోయింది.

IPL 2017: We decided to target RCB spinners, says MI's Kieron Pollard after win

వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి బద్రీ ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ ని నమోదు చేశాడు. ముంబై జట్టులో ప్రస్తతుం ఫామ్‌ మీదున్న రానా(11) కూడా అవుటవ్వడంతో ముంబై ఓటమి ఖాయమని అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది.

కానీ ఇక్కడే కింగ్ కీరన్ పొలార్డ్ అద్భుతం చేశాడు. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని ఏ మాత్రం తడబడకుండా కృనాల్‌ పాండ్యాతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి ముంబైని విజయ తీరాలకు చేర్చాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 93 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

బెంగళూరు బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ భారీ సిక్స్‌లతో విజృంభించాడు. ఆఖర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వగా, పాండ్యా సోదరులు హార్దిక్ (9 నాటౌ ట్), కృనాల్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం పొలార్డ్ మీడియాతో మాట్లాడాడు.

'ఇలాంటి పరిస్థితులే మనల్ని నిజమైన ఛాంపియన్లను చేస్తాయి. ఫామ్ గురించి ఏమాత్రం ఆందోళన చెందలేదు. మరోవైపు కృనాల్ కూడా ఎంతో అనుభవం కలిగిన ఆటగాడికి మాదిరి ఆడాడు. బెంగళూరు స్పిన్నర్లు టార్గెట్‌గా చేసుకుని మా ఇన్నింగ్స్ కొనసాగించాం' అని పొలాల్డ్ తెలిపాడు.

స్పిన్ బౌలింగ్ వేసిన ప్రతి ఓవర్‌లో కూడా సిక్స్ లేదా ఫోర్ బాదాలని నిర్ణయించుకున్నాం. అయితే ప్రమాదకరమైన బంతులను కూడా ఆడకుండా వదిలేయాని తామిద్దరం నిర్ణయించుకున్నామని మ్యాచ్ అనంతరం పొలార్డ్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+