జాంటీ రోడ్స్‌లా.. సాహా స్టన్నింగ్ క్యాచ్‌ని చూశారా! (వీడియో)
హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా వికెట్ కీపర్‌గా సత్తా చాటుతున్న వృద్ధిమాన్ సాహా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
ఐపీఎల్ 10వ సీజన్‌లో పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న సాహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా పట్టిన క్యాచ్ లెజెండరీ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌ను గుర్తుకు తెచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.
పంజాబ్ బౌలర్ వరుణ్ అరోన్ వేసిన షార్ట్ డెలివరీని బెంగళూరు ఆటగాడు మణ్‌దీప్ సింగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన సాహా పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ స్టన్నింగ్ క్యాచ్ అంటూ సాహాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని సాహా తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన గతి తెలిసిందే.
149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా (58 నాటౌట్: 38 బంతుల్లో 4x4, 3x6), కెప్టెన్ మాక్స్‌వెల్ (43 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 4x6) చెలరేగడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని చేధించింది.
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన సిరిస్‌లో కూడా టీమిండియా కీపర్‌గా వృద్ధిమాన్ సాహా అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసి పట్టుకున్నాడు. సాహా గాల్లోకి డైవ్ చేసి అసాధారణ రీతిలో క్యాచ్‌లు పట్టుకుని తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న సందర్భాలు అనేకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications