హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ఫైనల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సరికొత్త రికార్డుని సృష్టించాడు. ఐపీఎల్ పైనల్‌లో ఆడుతున్న పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
తమిళనాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్ వయసు 17 ఏళ్ల 228 రోజులు. 2008లో జడేజా 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఫైనల్ ఆడాడు. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పూణె విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్ 16పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.
క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పూణె బౌలర్ వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 2008 నుంచి 2015 వరకు ఆరు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ధోనీకి ఇది ఏడో ఫైనల్.
ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్ గురించి తెలుసుకోండి:
* హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి ఐపీఎల్ ఫైనల్ ఇదీ
* ముంబైకి ఇది నాలుగో పైనల్. 2010, 2013, 2015లలో చెన్నైతో పైనల్ ఆడింది. చివరి రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి విజయం సాధిస్తే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన జట్టుగా అవతరిస్తుంది.
* ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడనుండటం ఇది ఏడోసారి. ధోని నేతృత్వంలోని చెన్నై రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
* తేదీ, సమయం : మే 21 (ఆదివారం) at 20:00 IST
* వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్
* టీవీ లిస్టింగ్: సోనీ సిక్స్, సోనీ సిక్స్ HD, సోనీ ESPN, సోనీ ESPN HD, సెట్ మ్యాక్స్.
* ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Sony LIV, Hotstar