'క్రికెట్ అంటే భయం లేకుండా నాలాగే దూకుడుగా ఆడతారు'
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో పంజాబ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాళ్లకి సూచించాడు. ఐపీఎల్ 10వ సీజన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ పంజాజ్ జట్టుకు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
మంగళవారం పంజాబ్ జట్టు జెర్సీ విడుదల సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడాడు. 'ఈ ఐపీఎల్‌లో మేము జట్టు గెలుపోటముల గురించి అతిగా ఆలోచించం. మైదానంలో క్రికెటర్లు దూకుడుగా ఆడేందుకు నేను అనుమతిస్తాను. క్రికెట్ అంటే భయం లేకుండా నేను ఎలాగైతే ఆడానో అలాగే పంజాబ్ ఆటగాళ్లు ఆడతారు' అని అన్నాడు.
ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకోవడంపై
'ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకోవడం శుభ పరిణామం. ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లు బ్యాట్స్‌మెన్ ద్వారా గెలిస్తే.. మిగతా సగం బౌలర్లే గెలిపిస్తుంటారు. నిజానికి బౌలర్లే బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. మురళీ విజయ్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి చేర్చుకున్నాం. అతని చేరికతో మా బౌలింగ్ విభాగం ప్రస్తుతం బలోపేతమైంది' అని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్ లైనప్ అద్భుతం
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మార్టిన గుప్టిల్, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఇయాన్ మోర్గాన్, డారెన్ షమీ, డేవిడ్ మిల్లర్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉందని సెహ్వాగ్ చెప్పాడు. ఈసారి పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ వరకు వెళుతుందని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

గతేడాది పేలవ ప్రదర్శన
గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలో కెప్టెన్‌గా మురళీ విజయ్‌కి జట్టు ఫ్రాంఛైజీ పగ్గాలు అప్పగించినా అతడు జట్టుకు విజయాలను అందించలేకపోయాడు.

వ్యూహం మార్చిన పంజాబ్
దీంతో ఈ ఏడాది వ్యూహం మార్చాలని పంజాబ్ యోచిస్తోంది. గాయం కారణంగా ఇప్పటికే మురళీ విజయ్ టోర్నీకి దూరమవగా.. అతని స్థానంలో టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మని పంజాబ్ జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఆసీస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌కి పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications