Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2017: పంజాబ్ విజయాల వెనుక ఉన్నది ఎవరంటే?

హైదరాబాద్: గతేడాది అత్యంత చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్ 10వ సీజన్ కొత్త ఉత్సాహంతో వరుస విజయాను సొంతం చేసుకుంటోంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించింది.

పూణెతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన పంజాబ్, తాజాగా సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

పంజాబ్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా (58 నాటౌట్: 38 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు), కెప్టెన్ మాక్స్‌వెల్ (43 నాటౌట్: 22 బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సులు) చెలరేగడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ లక్ష్యాన్ని చేధించింది. ఈ వరుస విజయాల వెనుక ఉన్నది మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగేనని ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హషీం ఆమ్లా చెప్పాడు.

ఓ శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది

ఓ శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది

సోమవారం మ్యాచ్ అనంతరం ఆమ్లా మీడియాతో మాట్లాడాడు. ‘ఓ శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ అయిన సెహ్వాగ్‌ ఆటగాళ్ల విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేశారు' అని ఆమ్లా చెప్పుకొచ్చాడు.

సెహ్వాగ్ విలువైన సూచనలు ఇచ్చేవాడు

సెహ్వాగ్ విలువైన సూచనలు ఇచ్చేవాడు

ఒకప్పుడు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన్ సెహ్వాగ్ పంజాబ్ ఆటగాళ్ల విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని ఆమ్లా తెలిపాడు. ఆటగాళ్ల ఆటశైలిని మార్చుకోవాలని సెహ్వాగ్ ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని పేర్కొన్నాడు.

ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌లో వీరూ ఒకడు

ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌లో వీరూ ఒకడు

'ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌లో వీరూ ఒకరన్న విషయం మా అందరికీ తెలుసు. ఒక ప్రత్యేకశైలికి అలవాటుపడాలని చెప్పే వ్యక్తి కాదు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యం మేరకు ఉత్తమంగా రాణించాలని మాత్రమే సెహ్వాగ్ ప్రోత్సహిస్తన్నాడు. జట్టుకు ఉపయోగపడేరీతిలో ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించేవాడు' అని ఆమ్లా తెలిపాడు.

మాక్స్‌వెల్‌ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు

మాక్స్‌వెల్‌ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు

ఇక పంజాజ్ జట్టు కెప్టెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని, సీనియర్‌ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలు పట్టించుకుంటాడని ఆమ్లా అన్నాడు. 'మ్యాక్సీ రిలాక్స్ గా ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఆడాలని ప్రోత్సహిస్తుంటాడు. అతనో అద్భుతమైన ప్లేయర్' అని ఆమ్లా అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+