హైదరాబాద్: చెత్త బ్యాటింగ్ కారణంగానే ఓడిపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. అదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు అంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అవడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఘోరంగా ఓడిపోవడంపై చాలా చెత్తగా బ్యాటింగ్ చేశామని, ఇది నిజంగా బాధించిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
'చాలా చెత్తగా బ్యాటింగ్ చేశాం. ఇది చాలా బాధించింది. లక్ష్యాన్ని ఛేదింగలమని అనుకున్నాం. నిర్లక్ష్యపు బ్యాటింగ్ కొంప ముంచింది. ఈ సమయంలో ఇంతకుమించి చెప్పలేను. ఘోరంగా ఓడిపోయాం. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ ఓటమిని త్వరగా మార్చిపోయి మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్నాం' అని కోహ్లీ అన్నాడు.

'మాది ఇప్పటికీ అత్యుత్తమ జట్టే. గత మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు సాధించాం. ఈ ఓటమితో ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారని అనుకుంటున్నాను. ఈ షాక్ నుంచి బయటపడి ఎవరికి వారు సత్తా చాటాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నీలో మళ్లీ ఇటువంటి చెత్త ప్రదర్శన చేయబోమని హామీ యిస్తున్నా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కోల్‌కతా VS బెంగుళూరు స్కోరు కార్డు
ఇక ఈ మ్యాచ్‌లో తాను 'గోల్డెన్ డకౌట్' అవడంపై కూడా కోహ్లీ స్పందించాడు. కోల్‌కతా బౌలర్ నాథన్ కౌల్టర్-నైలీ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చేతికిలోకి వచ్చిన బంతిని పాండే అమాంతం ఒడిసిపట్టాడు.
ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న కోహ్లీ అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. కోపంతో కాలికి కట్టుకున్న ప్యాడ్లపై బ్యాట్‌తో బాదుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో అంఫైర్ ఏం జరిగిందని కోహ్లీని ప్రశ్నించగా, స్టాండ్స్ వైపు చూపిస్తూ ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించారని వెల్లడించాడు.
సైట్ స్క్రీన్ దగ్గర ఓ వ్యక్తి తచ్చాడుతుండాన్ని కోహ్లీ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.