న్యూఢిల్లీ: ఐండియన్ ప్రీమియర్ లీగ్-10వ సీజన్ కోసం విరాట్ కోహ్లీ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిశాడు. భుజం నొప్పి కారణంగా కోహ్లీ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ టెస్టులో కోహ్లీ గాయపడ్డాడు కోహ్లీ దీంతో చివరి టెస్టుకు దూరమైన కోహ్లీ వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
తాజాగా బీసీసీఐ వైద్య సిబ్బంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రకటన చేసి... కోహ్లీ ఏప్రిల్ 2వ వారం నుంచి ఐపీఎల్‌కి అందుబాటులో ఉంటాడని తెలిపింది. అయితే, ఆటకు దూరంగా ఉండలేని కోహ్లీ ఆర్‌సీబీ ఆటగాళ్ల కోసం వచ్చేశాడు. ఈ సందర్భంగా క్రిస్‌గేల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కోహ్లీకి స్వాగతం పలికారు.
గేల్, కోహ్లీలు తమదైన శైలిలో చిందేస్తూ కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ జట్టు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఏప్రిల్ 4న ఐపీఎల్-10వ సీజన్ ప్రారంభవేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అనంతరం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతున్న కోహ్లీ.. ఆడతాడా? లేడా అనేది సందేహంగానే ఉంది.