Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంఫైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ: కన్నీరు పెట్టాడు తెలుసా?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తోనే గొడవకు దిగిన కోహ్లీ చివరకు మళ్లీ మ్యాచ్ కోల్పోయి కన్నీరు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నరైన్ (17 బంతుల్లో 34, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడినా.. గంభీర్ (14) తొలిసారి విఫలమయ్యాడు.

IPL 2017: Virat Kohli Blasts Teammates for KKR Debacle

ఈ క్రమంలో మైదానంలోని ఫీల్డ్ అంపైర్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొడవకి దిగాడు. మ్యాచ్‌లో గంభీర్ ఔట్ నిర్ణయాన్ని వెల్లడించడంలో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ తడబడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కోహ్లి మైదానంలోని ఇద్దరి అంపైర్లతో వాదనకు దిగాడు. మధ్యలోనే క్రిస్‌గేల్ వచ్చి కోహ్లిని వారించే ప్రయత్నం చేశాడు.

ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన మిల్స్ బౌలింగ్‌లో బంతిని స్లిప్‌వైపు తరలించేందుకు గంభీర్ ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి బ్యాట్‌ని తాకకుండా గంభీర్ చేతి గ్లౌవ్స్‌ని తాకుతూ వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది. దీంతో బెంగళూరు జట్టు వికెట్ పడిన ఆనందంలో సంబరాలు చేసుకోసాగింది.

కానీ అంపైర్ క్రిస్ మాత్రం ఔట్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ మరో ఫీల్డ్ అంపైర్ నందన్‌తో చర్చించి తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌కి నివేదించాడు. అవుట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. ముందుగానే ఎందుకు నిర్ణయం ప్రకటించలేదు అంటూ కోహ్లి అంపైర్ నందన్‌తో వాదనకు దిగాడు. బంతి ఎలా వెళ్లిందో అతనికి చూపిస్తూ మైదానంలోనే అసహనం ప్రదర్శించాడు.

అదే సమయంలో కోహ్లీ తీరుని గమనిస్తూ నిల్చొన్న గంభీర్ మూడో అంఫైర్ అవుట్ అని ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. గత ఐపీఎల్ సీజన్లలో గంభీర్, విరాట్ కోహ్లి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+