Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కోహ్లీనే నెంబర్ వన్ (ఫోటోలు)

హైదరాబాద్: విరాట్ కోహ్లీ... భారత్‌లోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్న క్రికెటర్. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'రన్ మెషిన్'. తన అసాధారణ ఆటతో దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. భుజం నొప్పి గాయం కారణంగా ఐపీఎల్ 10వ సీజన్‌లో ఇంకా బరిలోకి దిగకపోయినా విరాట్ కోహ్లీకి ఆదరణ మాత్రం తగ్గలేదు.

ఈ సీజన్‌ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోయినా సోషల్ మీడియాలో కోహ్లీకి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌ పదో సీజన్‌లో ఆడుతున్న క్రికెటర్లలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లను సంపాదించుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

అత్యధికంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న ఆటగాడిగా కోహ్లీ

అత్యధికంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న ఆటగాడిగా కోహ్లీ

ఐపీఎల్ ఆటగాళ్లలో అత్యధికంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడని ఫేస్‌బుక్‌, ఇనిస్టాగ్రామ్‌లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఫేస్‌బుక్‌లో ఆ త‌ర్వాతి స్థానాల్లో యువ‌రాజ్‌సింగ్ (హైద‌రాబాద్‌), రోహిత్‌ శ‌ర్మ (ముంబై), ష‌కీబ్ అల్ హ‌స‌న్ (కోల్‌క‌తా), క్రిస్ గేల్ (బెంగ‌ళూరు), శిఖ‌ర్ ధావ‌న్ (హైద‌రాబాద్‌), గౌత‌మ్ గంభీర్ (కోల్‌క‌తా), హర్భ‌జ‌న్‌ సింగ్ (ముంబై), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (పంజాబ్‌) ఉన్నారు.

మొదటి మూడు మ్యాచ్‌‌లకు దూరమైన కోహ్లీ

మొదటి మూడు మ్యాచ్‌‌లకు దూరమైన కోహ్లీ

ఇక ఇనిస్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ త‌ర్వాత ధోని, డివిలియ‌ర్స్ (బెంగ‌ళూరు), యువ‌రాజ్‌సింగ్‌(హైదరాబాద్), రోహిత్‌శ‌ర్మ‌, సురేశ్ రైనా (గుజ‌రాత్‌), క్రిస్ గేల్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, ర‌వీంద్ర జ‌డేజా (గుజ‌రాత్‌), అజ్యింకె ర‌హానే (పుణె) ఉన్నారు. కాగా, గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌‌లకు దూరమైన కోహ్లీ శుకవారం ముంబైతో జరిగే మ్యాచ్‌‌లో బరిలోకి దిగుతున్నాడు. గ‌త సీజన్‌లో నాలుగు సెంచ‌రీల‌తో బెంగళూరుని ఫైనల్ వరకూ తీసుకెళ్లిన విరాట్ కోహ్లీ ఈసారి ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడోన‌ని ఫ్యాన్స్ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో టాప్‌-10 ఐపీఎల్‌ ఆటగాళ్లు

ఫేస్‌బుక్‌లో టాప్‌-10 ఐపీఎల్‌ ఆటగాళ్లు

1. విరాట్‌ కోహ్లి (బెంగళూరు)

2. మహేంద్ర సింగ్‌ ధోని (పుణె)

3. యువరాజ్‌సింగ్‌ (హైదరాబాద్‌)

4. రోహిత్‌ శర్మ (ముంబయి)

5. షకిబ్‌ ఉల్‌ హసన్‌ (కోల్‌కతా)

6. క్రిస్‌ గేల్‌ (బెంగళూరు)

7. శిఖర్‌ ధావన్‌ (హైదరాబాద్‌)

8. గౌతమ్‌ గంభీర్‌ (కోల్‌కతా)

9. హర్భజన్‌ సింగ్‌ (ముంబై)

10. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (పంజాబ్‌)

ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌-10 క్రికెటర్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌-10 క్రికెటర్స్‌

1. విరాట్‌ కోహ్లీ (బెంగళూరు)

2. మహేంద్రసింగ్‌ ధోని (పుణె)

3. డివిలియర్స్‌(బెంగళూరు)

4. యువరాజ్‌సింగ్‌ (హైదరాబాద్)

5. రోహిత్‌ శర్మ (ముంబై)

6. సురేశ్‌ రైనా(గుజరాత్‌)

7. క్రి స్‌ గేల్‌ (బెంగళూరు)

8. హర్భజన్‌సింగ్‌(ముంబై ఇండియన్స్‌)

9. రవీంద్ర జడేజా(గుజరాత్‌)

10. అజింక్యె రహానె (పుణె)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+