|
క్రిస్ గేల్‌కు కంగ్రాట్స్ చెప్పిన విజయ్ మాల్యా
దేశమంతా ఈ విషయమై మాట్లాడుకుంటుండగా విజయ్ మాల్యా మాత్రం క్రిస్ గేల్‌కు కంగ్రాట్స్ చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీ20ల్లో ప్రపంచ రికార్డు సాధించిన క్రిస్ గేల్‌ను యూనివర్సల్ బాస్‌గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
|
ఆన్లైన్లో వైరల్
విజయ్ మాల్యా ట్వీట్ ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. 'గేల్ సరే.. నీ సంగతేంటి?, గెయిల్‌ను మర్చిపోయి.. బెయిల్ గురించి ఆలోచించండి అంటూ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.
|
ఆర్సీబీ విజయాల్లో పాల్గొనకపోయారా?
'బెంగళూరుకు వచ్చి ఆర్సీబీ విజయాల్లో పాల్గొనకపోయారా?' అంటూ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.
లండన్ పారిపోయిన విజయ్ మాల్యా
దేశంలోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.. మాల్యా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.