‘బామ్మ’ ప్రార్థించడం వల్లే ముంబై గెలిచిందా!: ఇంతకీ ఆమె ఎవరు?
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. విజయం రెండు జట్లను దోబూచులాడింది. ఆఖరి ఓవర్‌లో పూణె విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.
ఈ సమయంలో క్రీజులో పూణె కెప్టెన్ స్టీవ్‌స్మిత్, మనోజ్ తివారీ ఉన్నారు. దీంతో మ్యాచ్ కూడా ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ అభిమానుల్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. మ్యాచ్ చూస్తున్న అభిమానులు సైతం ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
స్టేడియంలో దేవుడికి ప్రార్థన చేస్తూ కనిపించిన బామ్మ
ఈ సమయంలో ఒక బామ్మ స్టేడియంలో దేవుడికి ప్రార్థన చేస్తూ కనిపించారు. ఆమెను పదే పదే టీవీలో చూపించారు. పూణె విజయం సాధిస్తుందని అంతా భావించిన తరుణంలో జాన్సన్ అద్భుతం చేశాడు. రెండో బంతికి తివారీ, మూడో బంతికి స్మిత్‌ను అవుట్ చేసి పైనల్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.
ఒక పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
చివరకు పూణెపై ఒక పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై విజయం సాధించడంతో బామ్మ ప్రార్థన చేస్తున్న ఫొటో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆమె ప్రార్థనలు ఫలించే ముంబై ఇండియన్స్ విజయం సాధించిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ ఎవరా బామ్మ
ఇంతకీ ఎవరా బామ్మ.. అనుకుంటున్నారా? ముంబై ఫ్రాంచైజీ యజమానురాలు నీతా అంబాని అమ్మ పూర్ణిమా బెన్ దలాల్. ఆమెను అందరూ నానీ అని పిలుస్తారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆమె ఫొటో వైరల్ కావడంతో ముంబై ఇండియన్స్ ట్విటర్ పేజీలో ‘కృతజ్ఞతలు నానీ' అని ట్వీట్ చేసింది.

చివరి ఓవర్‌లో ఏం వ్యూహం అమలు చేశారనే దానిపై రోహిత్ శర్మ
అసలు చివరి ఓవర్‌లో ఏం వ్యూహం అమలు చేశామనే దానిపై మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 'చివరి ఓవర్‌లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్‌ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్‌తో చర్చించా' అని అన్నాడు.

స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం
'సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమని చెప్పా. అతను పేస్ బౌలింగ్‌ను ఎలా పేస్ చేస్తాడో మనం గతంలో చూశాం. అదే సమయంలో జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత పూణె బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications