Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'Mighty Hash': ఆమ్లా, మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌పై నెటిజన్లు

పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా(60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 ఫోర్లు) సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు కోల్పోయి పంజాబ్‌ 198 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు ఆమ్లా, షాన్‌మార్ష్‌ (21 బంతుల్లో 26; 5 ఫోర్లు) మంచి శుభారంభం అందించారు.

వికెట్లను కాపాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో షాన్ మార్ష్(26) తొలి వికెట్ గా అవుట్ కావడంతో కింగ్స్ స్కోరు బోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా (11) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

Twitterati praise 'Mighty Hash' Amla and Maxwell's innings

కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్స్‌వెల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మెక్లనగన్‌ వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా 6,6,4,4,6 బాది ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. 18 బంతుల్లో 40 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఆ తర్వాతి ఓవర్లో మలింగ వేసిన రెండో బంతిని స్టేడియం బయటకు పంపిన ఆమ్లా.. ఆ ఓవర్‌లో 22 పరుగులురాబట్టాడు. చివరికి బుమ్రా బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ ఔటవడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోనిస్(1) అవుటైనప్పటికీ ఆమ్లా తన జోరు తగ్గించలేదు.

ఇక చివరి ఓవర్ లో ఆమ్లా రెండు సిక్సర్లు సాధించడంతో కింగ్స్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్ ఆమ్లా, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్‌పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+