3 పరుగులతో సెంచరీ మిస్: రిషబ్ పంత్‌పై ప్రశంసల జల్లు
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అద్బుత ప్రదర్శన చేశాడు. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 61; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), రిషబ్ పంత్ (43 బంతుల్లో 97) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. దీంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇక ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో సత్తా చాటిన సంజూ సాంసన్‌ను కూడా మాజీ క్రికెటర్లు మెచ్చుకున్నారు. సంజూ శాంసన్ 31 బంతుల్లో 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అలాంటి కీలకమైన మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
సచిన్ టెండూల్కర్
43 బంతుల్లోనే 97 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌ను ఐపీఎల్‌లో తాను చూసిన అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లో ఒకటని సచిన్ ట్వీట్ చేశాడు. కేవలం ఈ ఒక్క సీజన్‌లోనే కాదని, ఇప్పటి వరకు జరిగిన 10 సీజన్లలో కూడా ఇదే మంచి ఇన్నింగ్స్ అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దీనికి తోడు అవుటైన తర్వాత రిషబ్ పంత్ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా టీవీ స్క్రీన్‌ను ఫొటో తీసి ఆ ఫొటో కూడా ట్విట్టర్లో ట్వీట్‌కు జత చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్
బంతిని బాదడంలో రిషబ్ పంత్ ప్రత్యేక సామర్థ్యం కలిగివున్నాడని, ఈ రోజు మ్యాచ్‌లో అతడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

హర్భజన్ సింగ్
రిషబ్ పంత్ బ్యాటింగ్ చూడముచ్చటగా ఉందని, అతడి ప్రతిభ అద్భుతమని హర్భజన్ సింగ్ కొనియాడాడు.
సౌరభ్ గంగూలీ
రిషబ్ పంత్, సంజూ సాంసన్ ఆట నయనానందకరంగా ఉందని, వీరిద్దరూ స్పెషల్ అంటూ సౌరభ్ గంగూలీ మెచ్చుకున్నాడు.
గౌతమ్ గంభీర్
రిషబ్, సాంసన్ బ్యాటింగ్ సీనియర్లను తలదన్నేలా ఉందని గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్
‘ప్రతిభ కలిగిన ఇద్దరు యువ ఆటగాళ్లు బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడారు. సానుకూల దృక్పథం, ప్రతిభ, భయం లేకుండా ఆడడం నాకు బాగా నచ్చింద'ని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మ
20 ఏళ్ల వయసులోనే రిషబ్ పవర్ హిట్టింగ్‌తో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదని, అతడు తృటిలో సెంచరీ కోల్పోవడం బాధ కలిగించిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications