For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో కోల్‌కతాపై విజయం: ధోని వల్లేనన్న సురేశ్ రైనా

చివరి నిమిషంలో మ్యాచ్‌ను మనవైపు ఎలా తిప్పుకోవాలో ధోనీ నుంచే నేర్చుకున్నానని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: చివరి నిమిషంలో మ్యాచ్‌ను మనవైపు ఎలా తిప్పుకోవాలో ధోనీ నుంచే నేర్చుకున్నానని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అన్నాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ లయన్స్ విజయం కీలక పాత్ర పోషించిన సురేశ్ రైనా 'మ్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు.

IPL 2017: Suresh Raina credits MS Dhoni for his batting success against KKR

మ్యాచ్ అనంతరం సురేశ్ రైనా మాట్లాడాడు. 'ఒత్తిడిలో బ్యాటింగ్‌ చేయడమంటే ఇష్టం. సవాల్‌తో కూడుకున్నది. సుమారు 10 సంవత్సరాల పాటు ధోనీతో కలిసి బ్యాటింగ్‌ చేశాను. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మనవైపు ఎలా తిప్పుకోవాలో, కెప్టెన్‌గా జట్టు విజయం కోసం ఆఖరి నిమిషంలో ఎలా పోరాడాలో ధోనీ నుంచే నేర్చుకున్నా' అని అన్నాడు.

అంతేకాదు ఒక్కో ఓవర్లో 9 లేదా 7 పరుగులు సాధించడం కూడా ధోనీ నుంచే నేర్చుకున్నానని, ధోనీ నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఈ రోజు విజయం సాధించగలిగానని సురేశ్ రైనా చెప్పాడు. నిజానికి తప్పకుండా విజయం సాధించాల్సిన మ్యాచ్‌ ఇది అని అనుకున్నానని రైనా అన్నాడు.

'నా మనసులో పదే పదే ఇదే తలుచుకున్నా. ఎలాగైనా గెలవాలి అనుకున్నా. అందుకోసం పోరాడాను. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ముందుకు వెళ్లగలం. ఒకవేళ ఈ మ్యాచ్‌ ఓడిపోతే డ్రస్సింగ్‌ రూమ్‌లో అందరూ చాలా నిరాశతో కనిపిస్తారు' అని రైనా చెప్పాడు.

ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రైనా నిలిచాడు. 'నువ్వు కెప్టెన్ ఉన్నప్పుడు, గేమ్‌లో విజయం సాధించిన తోటి సహచరులకు ఉదాహరణగా నిలవాలి. ఈ విషయాన్ని ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన సందర్భంలో గుర్తించాను' అని రైనా అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+