పుణే: ఐపీఎల్ 10 రెండో మ్యాచులో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తరఫున బట్లర్, రాణా, చివర్లో పాండ్యా మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. పుణే దానిని సులభంగా చేధించింది. పుణేను రహానే, స్మిత్ గెలిపించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నెమ్మదిగా కనిపించింది. 19 ఓవర్లలో ముంబై 154 పరుగులు చేసింది. కానీ చివర్లో పాండ్యా వరుస అయిదు బంతుల్లో 6, 6, 6, 4, 6 కొట్టాడు.
ఆ తర్వాత వైడ్, బై కారణంగా మరో రెండు పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ దిండా వేశాడు. ఈ ఓవర్లోనే ముంబై లేదా పాండ్యా 30 పరుగులు పిండుకున్నారు. దీంతో గౌరవప్రదమైన 184 పరుగులు అయ్యాయి.

అయితే, పుణే తరఫున రహానే, స్మిత్ అద్భుతంగా ఆడారు. రహానే తన శైలికి భిన్నంగా ఆడి.. 34 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 60 పరుగులు చేశాడు. స్మిత్ కూడా గెలుపు వరకు బ్యాటు ఝుళిపించాడు.
స్మిత్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 84 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. 19 ఓవర్ 4వ బంతి, 5వ బంతికి వరుసగా రెండు సిక్సులు కొట్టిన స్మిత్ మ్యాచును ముగించాడు. ధోనీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా బరిలోకి దిగాడు.
ముంబై తరఫున పాండ్యా చివరి ఓవర్లో 28 పరుగులు తీసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పుణే జట్టులో రహానే తన శైలికి భిన్నంగా ఆడాడు. మ్యాచ్ మొత్తం స్మిత్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.