ముంబైపై విజయం: కేక్‌తో సన్‌రైజర్స్ వేడుకలు (ఫోటోలు)
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సొంతగడ్డపై తిరుగులేదని మరోసారి సన్ రైజర్స్ నిరూపించుకుంది.
బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వార్నర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్ శిఖర్ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్), హెన్రిక్స్(44 పరుగులు) సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బౌలర్లలో మలింగ, బుమ్రా, క్లెనగన్‌లకు తలో వికెట్ దక్కింది.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ 15 పాయింట్లతో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనా 18 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సన్ రైజర్స్ టోర్నీలో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విజయాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు మీకోసం:

ధావన్‌కు కేక్ పూస్తున్న సన్ రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్
సోమవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కేక్ పూస్తున్న సన్ రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్.

మహ్మద్ నబీతో శిఖర్ ధావన్
ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి సన్ రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన బౌలర్ మహ్మద్ నబీతో శిఖర్ ధావన్.

మహ్మద్ నబీ
సన్ రైజర్స్ హైదరాబాద్ వేడుకల్లో ఆప్ఘనిస్థాన్ బౌలర్ మహ్మద్ నబీ. 4 ఓవర్లు వేసిన మహ్మద్ నబీ ఒక వికెట్ తీసుకుని 13 పరుగులిచ్చాడు.

కోచ్ టామ్ మూడీతో శిఖర్ ధావన్
ముంబైపై సన్ రైజర్స్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కోచ్ టామ్ మూడీ.

అర్ధసెంచరీ చేసిన శిఖర్ ధావన్
వార్నర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్ శిఖర్ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్), హెన్రిక్స్(44 పరుగులు) సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications