Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ 10వ ఎడిషన్: బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్‌ టీ20 టోర్నమెంట్‌కు బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5, 2017 నుంచి ఐపీఎల్ 10వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ లీగ్‌కు సంబంధించి బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) సభ్యులు బీసీసీఐ అధికారులతో ఫిబ్రవరి 1 (బుధవారం) సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి సంబంధించి వివరాలను బీసీసీఐ ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ లీగ్‌కు సంబంధించిన స్పాన్సర్లు, ఇతర అంశాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఐపీఎల్ 2017 ఎడిషన్ అనుకున్న ప్రకారమే జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను బీసీసీఐ/ఐపీఎల్ మేనేజ్‌మెంట్ టీమ్ త్వరలోనే వెల్లడించనుంది.

IPL 2017 to start on April 5, confirms BCCI

ఇక ఐపీఎల్‌లో ప్రాధాన్యం కలిగిన అంశాలపై మా కమిటీ సమావేశమై చర్చించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు, భాగస్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మీరు అనుకున్న విధంగా ఈ లీగ్‌ను నడిపించేందుకు కమిటీ, బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు తగిన ఆదేశాలు జారీ చేస్తామని మీడియా ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌లో ప్లేయర్ల వేలం ఈ నెల చివరిలో జరిగే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+