For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెహ్రా ఔట్: ప్లేఆఫ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు గట్టి షాక్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది.

By Nageshwara Rao

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్‌ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్‌ బౌలర్‌ ఆశిశ్‌ నెహ్రా ఇకపై జట్టుకు దూరం కానున్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఫిట్‌నెస్‌ లేమి కారణంగా పేసర్ ఆశిష్ నెహ్రా టోర్నీలో తర్వాత మ్యాచ్‌లు ఆడడని కోచ్‌ టామ్‌ మూడీ ప్రకటించాడు. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

IPL 2017: SRH paceman Ashish Nehra ruled out of play-offs

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించారు. ప్లేఆఫ్‌ బెర్త్‌ కోసం గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ నెహ్రా స్టాండ్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.

తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌ సత్తా చాటడం, ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్న సంగతి తెలిసిందే. నెహ్రా గైర్హాజరీతో సన్‌రైజర్స్‌ ఆడబోయే అన్ని ప్లేఆఫ్‌ మ్యాచ్‌లలో సిరాజ్‌కు స్థానం ఖాయమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు యువరాజ్‌సింగ్‌ ఈ మ్యాచ్‌ ఆడేది అనుమానంగానే ఉంది. యువీ ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపికైన యువరాజ్‌ సింగ్‌ మంగళవారం సాయంత్రం ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోబోతున్నాడని మూడీ వెల్లడించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+