హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఎంపికయ్యాడు. ఆర్‌సీబీ రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం నొప్పి గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో చివరి టెస్టుకు దూరమైన కోహ్లీ వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ వైద్య సిబ్బంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రకటన చేసి... కోహ్లీ ఏప్రిల్ 2వ వారం నుంచి ఐపీఎల్‌కి అందుబాటులో ఉంటాడని తెలిపింది.

ఈ నేపథ్యంలో కోహ్లీ స్ధానంలో ఆర్‌సీబీకి చెందిన ఆటగాడు షేన్ వాట్సన్‌ను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా నియమిస్తూ ఆర్‌సీబీ ఛైర్మన్ అమ్రిత్ థామస్ అధికారిక ప్రకటన చేశారు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో షేన్ వాట్సన్‌ను ఆర్‌సీబీ రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 10వ సీజన్ కోసం విరాట్ కోహ్లీ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కలిశాడు. క్రిస్‌గేల్‌తో పాటు పలువురు ఆర్‌సీబీ ఆటగాళ్లు కోహ్లీకి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఏప్రిల్ 4న ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. అనంతరం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరు తలపడనుంది.