హైదరాబాద్: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హాసన్ కోల్‌కతా తదుపరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ జట్టు తరఫున అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనాల్సి రావడంతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు షకీబ్ ప్రకటించాడు.
దీంతో పాటు ఈ సీజన్‌లో షకీబ్ అల్ హాసన్‌ని కోల్‌కతా పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇప్పటివరకు కోల్‌కతా పదకొండు మ్యాచ్‌లాడగా షకీబ్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన షకీబ్ బ్యాటింగ్‌లో ఒక్క పరుగుతో చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే వికెట్లుతీయకుండా 31 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం కోల్‌కతా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. వచ్చేనెల జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో సన్నహకంగా బంగ్లాదేశ్, ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరిస్‌లో పాల్గొనాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఆదేశాలు రావడంతో షకీబ్ గురువారం రాత్రి భారత్ నుంచి బయలుదేరుతున్నాడు.