హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, టెలివిజన్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో మంజ్రేకర్ స్పందించాడు.
ఏప్రిల్ 10న ముంబై-కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి అవుటైన వెస్టిండీస్ ఆటగాడు పొలార్డ్‌ను తాను బుర్రలేని ఆటగాడు అని అనలేదని వివరణ ఇచ్చాడు. మ్యాచ్ వీడియో ఫుటేజ్‌ని పరిశీలిస్తే అందులో 'బ్రెయిన్‌లెస్' అనే పదాన్ని మంజ్రేకర్ ప్రయోగించలేదని స్పష్టంగా తెలుస్తోంది.

అయితే తనను బ్రెయిన్ లెస్ అన్నట్లు భావించిన పొలార్డ్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. 'నేను ఎలా ఆడతానో నీకు తెలుసా.? బుర్రలేదని అన్నావు. మాటలు చాలా విలువైనవి. ఒక్కసారి నోరు జారితే వాటిని వెనక్కితీసుకోలేం' అని పొలార్డ్ ట్వీట్ చేశాడు.
ఈ నేపథ్యంలో పొలార్డ్‌పై తాను అలాంటి పదాలను ఉపయోగించలేదని సంజయ్ మంజ్రేకర్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాడు. 'టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతనికుందా? అని అన్నాను. నో బ్రెయిన్స్, బ్రెయిన్‌లెస్ లాంటి పదాలు వాడటం నా శైలి కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా.. అతన్ని నేను అవమానించలేదు' అని రాసుకొచ్చాడు.