Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం: 2 కోట్లకు అమ్ముడైన గౌతమ్ ఏమన్నాడో తెలుసా!

హైదరాబాద్: ఆఫ్ స్పిన్ బౌలింగ్ నేర్చుకోవడానికి అతడికి టీమిండియా వెటనర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆదర్శం. ఐపీఎల్ వేలంలో హర్భజన్ సింగ్ ఉన్న జట్టులో అతడు చోటు దక్కించుకోవడంపై కర్ణాటకకు చెందిన క్రికెటర్ క్రిష్ణప్ప గౌతమ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

సోమవారం బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో క్రిష్ణప్ప గౌతమ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు. వేలంలో గౌతమ్ కనీస ధరను రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. అయితే బిడ్డింగ్‌లో అతడికి రూ.2 కోట్లు చెల్లించి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

వేలం అనంతరం గౌతమ్ వన్ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ వేలంలో తనకు రూ. 2.6 కోట్ల ధర పలుకుతుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ఏదో ఒక ప్రాంఛైజీ తనను కొనుగోలు చేస్తే బాగుండని అనుకున్నానని చెప్పాడు.

లెజెండ్స్‌తో కలిసి ఆడటం

లెజెండ్స్‌తో కలిసి ఆడటం

'కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐపీఎల్ వేలం పాటను కుటుంబ సభ్యులతో కూర్చుని టీవీలో వీక్షిస్తున్నాను. ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడిని అయినందుకు సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, మహిళా జయవర్దనే, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ లాంటి వారి ఆడిన జట్టులో చోటు దక్కించుకోవడం నిజంగా అదృష్టం' అని అన్నాడు.

'బౌలింగ్‌లో నాకు ఎంతో ప్రేరణగా నిలిచిన వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో కలిసి ఆడే అవకాశం లభించింది. నిజంగా నాకు ఇది ఓ గొప్ప అవకాశం. ప్రస్తుతం పరిస్థితుల్లో నా ఫీలింగ్స్‌ను వర్ణించలేను. తన జీవితంలో ఇప్పటివరకు భజ్జీని కలవలేదని, అలాంటిది అతడితో కలిసి ఆడే అవకాశం వచ్చింది' అని చెప్పాడు.

2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం

2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం

2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన గౌతమ్ ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసుకున్నాడు. 20 టీ20ల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. 2016-17 రంజీ సీజన్‌లో కర్ణాటక జట్టు తరుపున 8 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసుకున్నాడు. ఇక 2016లో జరిగిన కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న నాల్గవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ లీగ్‌లో మైసూర్ వారియర్స్ జట్టు తరుపున ఆడిన మొత్తం 8 గేములాడిన గౌతమ్ 11 వికెట్లు తీశాడు. అత్యుత్తమం 3/23. యావరేజి 15.72.

భజ్జీ యాక్షన్‌ని కాపీ చేయడంపై

భజ్జీ యాక్షన్‌ని కాపీ చేయడంపై

15 ఏళ్ల వయసు నుంచే గౌతమ్ టెన్నిస్ బాల్‌తో బెంగుళూరులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. గౌతమ్ బౌలింగ్ అచ్చం హర్భజన్ సింగ్‌ను పోలి ఉండటంతో కర్ణాటక జట్టులోని ఆటగాళ్లు గౌతమ్ ను ముద్దుగా భజ్జీ అని పిలుస్తుంటారు. బౌలింగ్‌లో తాను ఎంతోగానో ఆరాధించే భజ్జీతో పాటు జట్టులోని మరో ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను కలిసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నట్లు గౌతమ్ పేర్కొన్నాడు.

ఇండియా ఏ జట్టులో చోటు

ఇండియా ఏ జట్టులో చోటు

ఇటీవలే ముంబైలోని బ్రాబోర్నే స్టేడియంలో ఆస్ట్రేలియాతో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 68 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సులతో 74 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాతో ఆడటం ఓ గొప్ప అనుభూతిగా గౌతమ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడే సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా సాధారణంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+