ఆ ఓటమి బాధించింది: 'ధోని ఫామ్‌పై ఆందోళన లేదు'
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో తన పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న మహేంద్ర సింగ్ ధోని ఫామ్‌పై రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్ కోసం రాజ్‌కోట్ వచ్చిన స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
'ధోని ఫామ్ గురించి ఏమాత్రం దిగులు లేదు. అతడో క్లాస్ ప్లేయర్. అయినా మా జట్టు ఆడింది కేవలం మూడు మ్యాచ్‌లే. కాబట్టి మిగతా మ్యాచ్‌లకు ధోని పుంజుకుంటాడు' అని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ధోని ఏమంత గొప్పగా ఆడటం లేదు.

తక్కువ స్కోర్లకే పరిమితమైన ధోని
ఇప్పటివరకు పూణె ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ధోనీ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో ధోని కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్లే ధోని అలా ఆడుతున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. పుణె జట్టు యాజమాన్యం కూడా ధోని ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ధోని ఫామ్‌పై దాదా అసహనం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సైతం ధోని ఫామ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20ల్లో ధోనీ ఏమంత గొప్పగా ఆడట్లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడిన పూణె... ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించగా... ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది.

ఆ ఓటమి బాధించింది
ఢిల్లీ ఓటమిపై స్పందించిన స్మిత్ ఆ ఓటమి తనత పాటు జట్టులోని ఆటగాళ్లను ఎంతో బాధించిందందని చెప్పుకొచ్చాడు. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌లో తాను ఆడలేకపోయానని, ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నానని, గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటున్నట్లు స్మిత్ వెల్లడించాడు.

ఇమ్రాన్ తాహీర్‌పై ప్రశంస
అనంతరం పూణె బౌలర్ ఇమ్రాన్ తాహీర్ గురించి స్మిత్ మాట్లాడాడు. జట్టులో ఇమ్రాన్ కీలక ఆటగాడు అయ్యాడని, మంచి గణాంకాలతో వికెట్లు తీయగలుగుతున్నాడని చెప్పాడు. టీ20ల్లో తాహీర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ అని, వ్యూహాత్మకంగా బౌలింగ్ వేస్తున్నాడని స్మిత్ కొనియాడాడు.

జడేజాలేని లోటు కనిపిస్తోంది
ఇక, గుజరాత్ లయన్స్ జట్టులో రవీంద్ర జడేజా లేనిలోటు స్పష్టంగా కనపడుతోందని, జడేజా తిరిగి జట్టులోకి వస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో గుజరాత్ మరింత బలంగా ఉంటుందని స్మిత్ తెలిపాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు పూణె, గుజరాత్ జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications