Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా ఎఫెక్ట్: 20వ ఓవర్, ఐపీఎల్ చరిత్రలో దిండా చెత్త రికార్డ్, మ్యాచ్ హైలెట్స్

పుణే: ఐపీఎల్ రెండో మ్యాచులో రైజింగ్ సన్స్ సూపర్ జెయింట్స్... ముంబై ఇండియన్స్ పైన 7 వికెట్ల తేడాతో గెలిచింది. పుణే సొంతగడ్డపై విజయం సాధించి అభిమానులకు ఆనందాన్ని పంచింది.

ముంబై ఆట ఓ విధంగా నెమ్మదిగా సాగింది. చివరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో మూడు సిక్సులు, ఆ తర్వాత ఫోర్, మళ్లీ సిక్స్ కొట్టాడు. దీంతో దిండా వేసిన చివరి ఓవర్లో ముంబై 30 పరుగులు పిండుకుంది.

Ashok Dinda

165కు అటు ఇటు పరుగులకు పరిమితం అవుతుందకున్న ముంబై చివరి ఓవర్లో బాగా పరుగులు రావడంతో 184 స్కోర్ చేసింది. ఆ తర్వాత పుణే 19.5 ఓవర్లలో 187 పరుగులు చేసింది.

చివరి ఓవర్‌కు ముందు పాండ్యా 9 బంతుల్లో 7 పరుగులతో ఉన్నాడు. చివరి ఓవర్లో అయిదు బంతుల్లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్ కారణంగా.. అతను 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

చివరి ఓవర్ వేసిన దిండాకు ఇది చేదు గుర్తు అని చెప్పవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన చివరో ఓవర్ ఇదే. దీంతో దిండా తన పేరిట ఇప్పుడు చేదు రికార్డును నమోదు చేసుకున్నాడు.

- చివరి ఓవర్ కొంత సస్పెన్స్‌గా సాగింది. ముంబై ఇన్నింగ్స్‌లోను ఇదే కనిపించింది. దిండా బౌలింగులో పాండ్యా 28 పరుగులు రాబట్టడంతో.. మొత్తంగా ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. పుణే చివరి ఓవర్ కూడా ఉత్కంఠగా కనిపించింది.
185 పరుగులు చేయాల్సిన తరుణంలో 19 ఓవర్లలో పుణే 172 పరుగులు చేసింది. 6 బంతుల్లో 13 పరుగులు చేయాలి.
చివరి ఓవర్ పొలార్డ్ వేశాడు. తొలి బంతికి ధోనీ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి స్మిత్ ఒక పరుగు తీశాడు. మూడో బంతికి మళ్లీ ధోనీ ఒక పరుగు తీశాడు. దీంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో స్మిత్ వరుసగా 4, 5వ బంతుల్లో రెండు సిక్సులు కొట్టి స్కోర్ 187 చేయడంతో పాటు పుణేను గెలిపించాడు.
- పుణే 18 ఫోర్లు, 6 సిక్సులు కొట్టింది.
- ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ధోనీ కెప్టెన్‌గా కాకుండా ఆడాడు. ఈ సీజన్‌కు స్మిత్ కెప్టెన్.
- ముంబై 12 ఫోర్లు, 11 సిక్సులు కొట్టింది.
- పవర్ ప్లేలో ముంబై 61 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది.
- దిండా తన 20వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్లో ఇదే చెత్త రికార్డ్.
- దిండా చివరి ఓవర్లో పాండ్యా వరుసగా మూడు సిక్సులు కొట్టాడు.
- దిండా చివరి ఓవర్లో 6, 6, 6, 4 , 6, 1 వైడ్ (రనౌట్), 1 బై ద్వారా ముంబై పరుగులు సాధించింది.
- 50 పరుగులు ఇచ్చిన వారిలో దిండా చేరాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+