Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో రెండోసారి: వాగ్వాదానికి మూల్యం చెల్లించిన రోహిత్‌ శర్మ

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రోహిత్‌ శర్మ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పూణే జెయింట్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అంఫైర్ ‌వాగ్వాదానికి దిగాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు 160 పరుగులు సాధించింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మూడో బంతికి రోహిత్‌ ఆఫ్‌ వికెట్‌ వైపు జరగ్గా.. ఉనాద్కత్‌ బంతిని బాగా ఎడంగా వేశాడు.

IPL 2017: Rohit Sharma fined 50% of match fee

ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వలేదని అంపైర్ ఎస్.రవితో వాగ్వాదానికి దిగాడు. నేరుగా ఎంపైర్ వద్దకు వెళ్లి ఆ బంతి వైడ్ ఎందుకు ఇవ్వలేదని వాదించాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించినందుకు అతడి మ్యాచ్‌లో 50 శాతం కోత విధించారు.

అంపైర్‌తో వాగ్వాదంతో రోహిత్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లెవల్‌-1 ఆర్టికల్‌ 2.1.5 నియమావళిని రెండోసారి అతిక్రమించినట్లైంది. దీంతో రోహిత్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించినట్లు ఐపీఎల్‌ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్‌ కూడా తప్పుని ఒప్పుకోవడం విశేషం.

కాగా ఐపీఎల్ పదో సీజన్‌లో రోహిత్ శర్మ ఇలా చేయడం రెండో సారి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి మందలింపుకు గురయ్యాడు. సునీల్ నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైన రోహిత్ శర్మ.. అంపైర్‌ సీకే నందన్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్‌ వైపు బ్యాటు చూపిస్తూ అసంతృప్తిగా మైదానం వీడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+