హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డుని సృష్టించాడు. హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది.

తాజా విజయంతో మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, అంబటి రాయుడుల రికార్డులను రోహిత్ శర్మ అధిగమించాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 టైటిళ్లను గెలిచిన రికార్డును రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. ఆదివారం పూణైపై సాధించిన టైటిల్ రోహిత్ శర్మకు ముంబై తరుపున మూడోది కాగా, మొత్తంగా ఏడో టీ20 టైటిల్ కావడం విశేషం.
రోహిత్ శర్మ ఆడిన భారత జట్టు వరల్ట్ టీ20 టైటిల్(2007), ఆసియా కప్ (2016), నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు (ముంబైతో మూడు, డెక్కన్ ఛార్జర్స్)లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వెబ్‌సైట్ రోహిత్ శర్మను అత్యంత సక్సెస్‌పుల్ భారత ఆటగాడిగా అభివర్ణించింది.
ఐపీఎల్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ధోని, రైనా, అశ్విన్, రాయుడులు ఇప్పటివరకు ఆరు టైటిళ్లలో భాగస్వామ్యమయ్యారు. యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్‌లు ఐదు టైటిళ్లలో భాగస్వామ్యమయ్యారు. ఐపీఎల్ పదో టైటిల్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో పూణెపై విజయం సాధించింది.