హైదరాబాద్: మంగళవారం పూణె వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌కి రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ దూరమయ్యాడు. మనోజ్ తివారీ తండ్రి ఆకస్మిక మరణమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మనోజ్ తివారీ మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి బయల్దేరిన తర్వాత అతడి తండ్రి ఆకస్మికంగా మరణించాడు.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ వేసేటప్పుడు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్‌తో పాటు పూణె కెప్టెన్‌గా స్మిత్‌కు బదులుగా రహానే వచ్చాడు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ స్మిత్‌కు ఆరోగ్యం బాగోలేదని, కడుపు నెప్పి కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో తాను కెప్టెన్‌గా మారాల్సివచ్చిందని రహానె తెలిపాడు.