పదో సీజన్‌లో ముంబై సిక్సర్ల రికార్డు: అట్టడుగున సన్‌రైజర్స్
హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పూణెపై ఒక పరుగు తేడాతో విజయం సాధించి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 117 సిక్సర్లు నమోదు చేసి అగ్రస్థానంలో నిలవగా, సన్ రైజర్స్ 70 సిక్సులతో అట్టడుగున నిలిచింది. టోర్నీ ఆద్యంతం అన్ని జట్లూ తమ అభిమానులను అలరించేందుకు యత్నించాయి. దీంతో ఎప్పటిలాగే పదో సీజన్‌లో కూడా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

టోర్నీ మొత్తంలో 705 సిక్సర్లు
ఈ టోర్నీ మొత్తంలో 705 సిక్సర్లు నమోదయ్యాయి. గతేడాది నమోదైన 638 సిక్సర్ల కంటే 67 సిక్సర్లను ఆటగాళ్లు ఈ సీజన్లో రాబట్టారు. ముంబై తర్వాత 92 సిక్సర్లతో గుజరాత్ లయన్స్, 89 సిక్సర్లతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

70 సిక్సర్లతో సన్‌రైజర్స్ ఆఖరి స్థానం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 87 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 87 సిక్సర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు75 సిక్సర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 70 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఆటగాళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అత్యధికంగా 26 సిక్సర్లు బాది తొలి స్థానంలో నిలిచాడు.

26 సిక్సర్లు బాది తొలి స్థానంలో నిలిచిన వార్నర్
ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 26 సిక్సర్లు, రిషబ్ పంత్ 24 సిక్సర్లు, కీరన్ పోలార్డ్ 22 సిక్సర్లు, రాబిన్ ఉతప్ప 21 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సిక్సులు నమోదైన సీజన్ మాత్రం 2012.

74 మ్యాచ్‌ల్లో 104 మంది ఆటగాళ్లు 731 సిక్సులు
ఈ సీజన్‌లో 74 మ్యాచ్‌ల్లో 104 మంది ఆటగాళ్లు 731 సిక్సులు బాదారు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌లో 60 మ్యాచ్‌ల్లో 90 మంది ఆటగాళ్లు 120 ఇన్నింగ్స్‌ల్లో 638 సిక్సులు బాదారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications