Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ 2017: ఆల్‌టైం రికార్డు వ్యూయర్ షిప్

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించడానికి వచ్చిన పదో సీజన్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.

చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ అభిమాన జట్లు, క్రికెటర్ల ప్రదర్శనను చూసేందుకు అందరూ అమితాసక్తి కనబరుస్తున్నారు. తొలి మూడు మ్యాచ్‌లను రికార్డు స్థాయిలో 185.7 మిలియన్ల మంది వీక్షించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు అని నిర్వహకులు అంటున్నారు.

IPL 2017: Record breaking viewership after first week

మ్యాచ్‌ను చూసేందుకు ఒక వ్యూయర్ సగటున 72 నిమిషాల సమయం కేటాయించాడు. ఇది ఐపీఎల్ ఆల్‌ టైం రికార్డు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. 2016 సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లను దాదాపు 160.7 మిలియన్ల మంది మాత్రమే చూశారు.

గతేడాది ఒక వీక్షకుడు మ్యాచ్‌ను చూసేందుకు సగటున 46 నిమిషాల సమయం వెచ్చించారు. ఐపీఎల్ పదో సీజన్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తొలి వారంలోనే ఐపీఎల్ పదో సీజన్ ఆల్ టైం రికార్డుని నమోదు చేస్తే లీగ్ పూర్తయ్యే నాటికి ఏయే రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+