Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఓపెనింగ్ మ్యాచ్‌కు ఏబీ దూరం, టోర్నీ నుంచి సర్ఫరాజ్ ఔట్

హైదరాబాద్: ఈసారైనా ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకోవాలని భావిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 10వ సీజన్‌లో ఆటగాళ్లు గాయాల బెడద నుంచి తప్పించుకోలేక పోతున్నారు.

ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా లీగ్‌కు దూరం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లీగ్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏబీ డివిలియర్స్ కూడా ప్రారంభ మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ ట్విట్టర్‌లో అభిమానులుక తెలియజేశాడు.

నిజానికి కోహ్లీ స్థానంలో బెంగళూరు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌కు బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్‌సీబీ తొలుత భావిచింది. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌కు తమ కెప్టెన్ ఏబీ అంటూ ఆ జట్టు ప్రధాన కోచ్ డానియల్ వెటోరి కూడా ఒక ప్రకటన చేశాడు.

IPL 2017: RCB's AB de Villiers to miss opener; Sarfaraz doubtful for entire tournament

అయితే డివిలియర్స్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ ట్వీట్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డివిలియర్స్ పాల్గొనడం లేదు. అతని స్థానంలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు మంగళవారం ఆర్‌సీబీ అధికారిక ప్రకటన చేసింది. ఆర్‌సీబీ జట్టులో కోహ్లీ, డివిలియర్స్‌లు గైర్హాజరీ అయితే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్లు కోచ్ వెటోరి తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత పడుతుందని చెప్పాడు.

ఇదిలా ఉంటే లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. సోమవారం బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మైదానంలో ప్రమాదవశాత్తూ సర్ఫరాజ్‌ పడిపోయాడు. దీంతో అతడి కాలుకి బలంగా గాయమైంది. వెంటనే ఫిజియో, వైద్య సిబ్బంది సర్ఫరాజ్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు.

అనంతరం ఫిజియో విశ్రాంతి సూచించడంతో సర్ఫరాజ్‌ ఐపీఎల్‌కి దూరమైనట్లు బెంగళూరు జట్టు ప్రకటించింది. బుధవారం నుంచి ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్‌, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+