Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్‌ను తప్పించడంపై బెంగళూరు కోచ్‌ ఏమన్నాడో తెలుసా?

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వేదికగా రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్‌ను తప్పించడాన్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోచ్‌ డేనియల్‌ వెటోరి సమర్థించుకున్నాడు.

గేల్ స్ధానంలో షేన్‌ వాట్సన్‌ను ఎంపిక చేయడంలో తప్పులేదని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ముగిశాక ఒక బౌలర్‌ కొరత ఉందని, జట్టు అవసరా కోసమే షేన్‌ వాట్సన్‌ ఆల్‌రౌండర్‌గా సరిపోతాడని భావించామని పేర్కొన్నాడు.

IPL 2017: RCB coach gives reason for dropping Chris Gayle

ఇందులో భాగంగానే గేల్ స్ధానంలో షేన్ వాట్సన్‌ని కొనసాగిస్తున్నామని తెలిపాడు. అంతకు ముందు జరిగిన ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో ఒక బౌలర్‌ కొరత ఉన్నట్లు అనిపించిందని అన్నాడు. తన ప్రదర్శనతో షేన్ వాట్సన్ మంచి టీ20 ఆల్ రౌండర్‌గా అయ్యాడని తెలిపాడు.

అందుకే ఆదివారం పూణె మ్యాచ్‌లో గేల్ స్ధానంలో వాట్సన్‌ని ఎంపిక చేసినట్లు చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు 27 పరుగులతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో వాట్సన్ ప్రదర్శన కూడా ఏమంతగా లేదు.

ఆదివారం పూణెతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 44 పరుగులిచ్చాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 14 పరుగులు చేసి బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. డెత్ ఓవర్లలో బెంగళూరు బౌలర్లు పరుగులు సమర్పించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని వెటోరి పేర్కొన్నాడు. చిన్నసామి పిచ్ బాగుందని, బౌలర్లకు సహకరించగలదని వెటోరీ అశాభావం వ్యక్తం చేశాడు.. ఇక్కడ జరిగే అన్ని మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్నాయని వెటోరి పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+