Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానులకు విరాట్ కోహ్లీ క్షమాపణ: ఎందుకో తెలుసా?

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసినందుకు అభిమానులకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్షమాపణలు కోరాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు.

'మాపై అంతులేని ప్రేమ కురిపించి వెన్నంటి నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మేము స్థాయికి తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాన'ని కోహ్లి ట్వీట్‌ చేశాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఐపీఎల్ పదో సీజన్‌ను త్వరగా మర్చిపోవాలకుంటున్నట్టు కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్‌ పదో సీజన్ తమకు ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. బ్యాటింగ్‌లో రాణిస్తే బౌలింగ్‌లో విఫలమయ్యామని చెప్పుకొచ్చాడు.

 IPL 2017: RCB captain Virat Kohli apologises to fans

ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్‌ నుంచి వైదొలగిన కోహ్లీ 5 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడిన బెంగళూరు కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి పది మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

ఇక పదో సీజన్‌లో బెంగళూరు తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఈనెల 14న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో ఆడనుంది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+