Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సక్సెస్ స్టోరీ: ధోనీ ఇంటి వద్ద సామాన్య ఫ్యాన్‌గా ఎదురుచూశా!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ఒకడు. నిజానికి ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు పూణె జట్టులో ధోని, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్‌లు సత్తా చాటారని అందరూ భావించారు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

అయితే సీజన్ ప్రారంభమైన తర్వాత సీనియర్ల కంటే ధీటుగా త్రిపాఠి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ నుంచి వచ్చిన రాహుల్ త్రిపాఠి ఒకప్పుడు ధోనీ ఇంటి వద్ద ఒక సామాన్య అభిమానిగా ఎదురుచూసిన కుర్రాడు.

అలా ఎదురుచూసిన కుర్రాడు ఇప్పుడు తన అభిమాన క్రికెట్ ధోనితో కలిసి పూణె జట్టుకు ఆడుతున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన త్రిపాఠి పూణె జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ గెలుపోటముల సంగతి పక్కన పెడితే రాహుల్ త్రిపాఠి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

IPL 2017: Rahul Tripathi Once Stood Outside MS Dhoni's House As A Fan. Now They Are Teammates

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా నెట్స్‌లో ధోనితో కలిసి ఆడాల్సి వచ్చిందని, ఆ సమయంలో కొన్ని బంతులు సమర్థంగా ఎదుర్కో లేకపోయానని త్రిపాఠి చెప్పాడు. అంతేకాదు ధోనీ ఎదురుగా నిల్చుని ఉండటంతో టెన్షన్‌కు లోనయ్యానని కూడా తెలిపాడు.

పదో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో త్రిపాఠి సెంచరీని మిస్ చేసుకున్నాడు. 26 ఏళ్ల రాహుల్ త్రిపాఠి రంజీల్లో మహారాష్ట్ర తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దేశవాళీ టీ20 క్రికెట్లో 22 మ్యాచ్‌లాడి 520 పరుగులతో 28.88 యావరేజిని నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+