పిచ్‌పైకి దూసుకొచ్చిన ధోని అభిమాని, స్మిత్ యాక్షన్ ఇదీ (ఫోటోలు)
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్‌లో మేటి జట్లను మట్టికరిపిస్తూ టాప్‌లో నిలిచిన ముంబైని పుణె మరోమారు మట్టికరిపించింది. ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లోకి అడుగుపెడుదామనుకున్న ముంబై ఆశలను స్మిత్ సేన వమ్ముచేసింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో ముంబైకి పూణె గట్టి షాకిచ్చింది. వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూణె 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనకు పూర్తి భిన్నంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని తుది పోరుకు అర్హత సాధించింది.
అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ బ్యాట్స్‌మెన తడబడి నిలబడ్డారు. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4x4, 2x6), రహానే (43 బంతుల్లో 56; 5x4, 1x6), అర్ధ సెంచరీలు చేయడంతో పూణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. [స్కోరుకార్డు ]
ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని తొలి ఓవర్‌లోనే డకౌట్ చేసి మెక్లనగాన్ పుణెకి షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌స్మిత్(1)ని రెండో ఓవర్‌లో మలింగ అవుట్ చేయడంతో పూణె ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రహానే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ముంబై బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కి 80 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రహానే.. కర్ణశర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్ల)తో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో ధోని రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. మనోజ్ తివారీ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌లో పుణె ఏకంగా 26 పరుగులు సాధించింది. చివరి ఓవర్ వేసిన బుమ్రాపై కూడా ధోని విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ధోని 15 పరుగులు రాబట్టాడు.
అనంతరం పూణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబై ఓపెనర్ సిమ్మన్స్(5) రనౌట్‌తో మొదలైన ముంబై వికెట్ల పతనం మొదలైంది. సుందర్ తన రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్‌శర్మ(1)తో పాటు రాయుడు(0)ను ఔట్ చేసి ముంబైని ఘోరంగా దెబ్బకొట్టాడు.
వీరిని అనుసరిస్తూ పొలార్డ్(7) కూడా సుందర్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మధ్యలో బౌండరీలతో ఆకట్టుకున్నా పాండ్యా సోదరులు హార్దిక్(14), కృనాల్(15) వెంటవెంటనే నిష్క్రమించడంతో ముంబై ఓటమి ఖరారైంది. మరోవైపు పార్థివ్‌పటేల్ (40 బంతుల్లో 52, 3ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీ పోరాటం వృథా అయ్యింది.
పూణె బౌలర్లలలో ఉనాద్కత్(1/24), ఫెర్గుసన్(1/21) ఒక్కో వికెట్ తీశారు. మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించిన సుందర్ వాషింగ్టన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మే 21న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్లో క్వాలిఫయర్-2 విజేతతో పూణె తలపడుతుంది.

వికెట్ తీసిన ఆనందంలో పూణె ఆటగాళ్లు
ముంబై ఇండియన్స్ వికెట్ తీసిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న పూణె ఆటగాళ్లు.

మైదానంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని
మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఓ అభిమాని ధోనిని కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులు అతడిని తీసుకెళ్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు.

గెలిచిన అనందరంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్
వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూణె 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం గెలిచిన ఆనందంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాక్షన్.

చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మనోజ్ తివారీ, ధోని
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో ధోని రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. మనోజ్ తివారీ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌లో పుణె ఏకంగా 26 పరుగులు సాధించింది. చివరి ఓవర్ వేసిన బుమ్రాపై కూడా ధోని విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ధోని 15 పరుగులు రాబట్టాడు.

అజ్యింకె రహానే
ముంబై ఇండియన్స్‌పై అర్ధసెంచరీ సాధించిన తర్వాత అభివాదం చేస్తోన్న పూణె ఆటగాడు అజ్యింకె రహానే.
Note: All images taken from IPL official website.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications