For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2017: ఆ ఘనత కోహ్లీ, భజ్జీలకే దక్కింది

చూస్తుండగానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. బుధవారం సాయంత్రం ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: చూస్తుండగానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. బుధవారం సాయంత్రం ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే స్టార్‌ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది.

నిజం చెప్పాలంటే 2007లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు అంతా సంబురమే. ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ వరం. క్రికెటర్ల వేలం, భారీ మొత్తాలు దక్కించుకోవడం, ఆటలో నిబంధనలు, మైదానంలో వినోదం... ఇలా ప్రతీది సంచలనంగానే మారింది. ప్రాంఛైజీలకు కూడా ఐపీఎల్ కాసుల వర్షం కురిపించింది.

Players who have played same team in every season of the IPL.

తొమ్మిది సీజన్లను ఘనంగా ముగించుకుని ఇప్పుడు ఐపీఎల్ పదో సీజన్‌‌కు ముస్తాబైంది. 2008 సీజన్‌లోని ఎనిమిది జట్ల తొలి మ్యాచ్‌ల బరిలోకి దిగిన ఆటగాళ్లందరికీ అదే మొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌. నాడు ఆయా టీమ్‌ల తుది జట్టులో ఆడిన 88 మందిలో ఇప్పుడు ఎంత మంది చురుగ్గా ఉన్నారు.

మరికొందరు ఐపీఎల్‌కు దూరమయ్యారు. అయితే ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి పదో సీజన్‌ వరకు కూడా జట్టు మారకుండా ఉన్న ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, హర్భజన్‌ సింగ్‌ మాత్రమే. ఈ ఇద్దరూ తొలి సీజన్ నుంచి పదో సీజన్ వరకు అదే జట్లకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి.

పదో సీజన్ సందర్భంగా తొలి సీజన్‌లో ఆడిన ఆటగాళ్లు వీరే:

కోల్‌కతా నైట్ రైడర్స్: సౌరభ్ గంగూలీ, బ్రెండన్‌ మెకల్లమ్, రికీ పాంటింగ్, డేవిడ్‌ హస్సీ, మొహమ్మద్‌ హఫీజ్, లక్ష్మీరతన్‌ శుక్లా, వృద్ధిమాన్ సాహా, అజిత్ అగార్కర్, దిండా, మురళీ కార్తీక్, ఇషాంత్‌ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రాహుల్ ద్రవిడ్, వసీం జాఫర్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలిస్, బ్రాత్ వైట్, బౌచర్, బాలచంద్ర అఖిల్, ఆష్లే నోఫ్‌కీ, ప్రవీణ్‌ కుమార్, జహీర్, సునీల్‌ జోషి

చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, మ్యాథ్యూ హేడెన్, మైక్‌ హస్సీ, జాకబ్ ఓరమ్, బద్రీనాథ్, జోగీందర్, పళని అమర్‌నాథ్, గోనీ, ముత్తయ్య మురళీధరన్‌.

పంజాబ్‌ కింగ్స్ ఎలెవన్: యువరాజ్ సింగ్, కరణ్‌ గోయల్, హోప్స్, కుమార సంగక్కర, సైమన్ కటిచ్, ఇర్ఫాన్‌ పఠాన్, పంకజ్‌ ధర్మాణి, బ్రెట్‌లీ, పీయూష్‌ చావ్లా, విల్కిన్‌ మోటా, శ్రీశాంత్‌.

ఢిల్లీ డేర్ డెవిల్స్: వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్‌ ధావన్, మనోజ్‌ తివారి, దినేశ్‌ కార్తీక్, రజత్‌ భాటియా, మన్హాస్, వెటోరి, మహరూఫ్, బ్రెట్‌ గీవ్స్, మెక్‌గ్రాత్‌.

రాజస్థాన్‌ రాయల్స్: షేన్ వాట్సన్, మహమ్మద్ కైఫ్, లీమన్, రవీంద్ర జడేజా, తరువర్‌ కోహ్లి, యూసుఫ్, మహేశ్‌ రావత్, దినేశ్‌ సాలుంకే, వార్న్, సిద్ధార్థ్‌ త్రివేది, మునాఫ్‌.

డక్కన్‌ చార్జర్స్‌: ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీవీఎస్ లక్ష్మణ్, సైమండ్స్, రోహిత్ శర్మ, స్టయిరిస్, వేణుగోపాలరావు, అర్జున్‌ యాదవ్, బంగర్, వాస్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్‌ ఓజా.

ముంబై ఇండియన్స్: ల్యూక్‌ రోంచి, సనత్ జయసూర్య, డొమినిక్‌ థోర్నిలి, రాబిన్ ఉతప్ప, పినాల్‌ షా, అభిషేక్‌ నాయర్, పొలాక్, హర్భజన్, ముసవిర్‌ ఖోటే, నెహ్రా, ధావల్‌ కులకర్ణి

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+