ఐపీఎల్: గుజరాత్‌పై శ్రేయస్ చెలరేగాడిలా! (ఫోటోలు)
హైదరాబాద్: మొహాలి వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
గుజరాత్ ఆటగాళ్లలో అరోన్ ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ
19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసి విజయం సాధించింది.
ఢిల్లీ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కమిన్స్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అతడికి మద్దతుగా నిలిచాడు. తృటిలో సెంచరీ మిస్ అయిన శ్రేయస్‌కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

మహ్మద్ షమీతో అమిత్ మిశ్రా
గుజరాత్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా.

ఇషాన్ కిషన్
మొహలి వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం.

మహ్మద్ షమీ, డ్వేన్ స్మిత్
మొహాలి వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్ మెన్ డ్వేన్ స్మిత్‌ను అవుట్ చేసిన సందర్భంలో సంబరాలు చేసుకుంటున్న మహ్మద్ షమీ, కేదార్ జాదవ్.

దినేశ్ కార్తీక్
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు దినేశ్ కార్తీక్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో రాణించడంతో గుజరాత్ 195 పరుగులు చేసింది.

ఆరోన్ ఫించ్
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు ఆరోన్ ఫించ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్
ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్.

అభిమానితో సురేశ్ రైనా
గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాను కలిసేందుకు రింకూ అనే అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడి రాకను గమనించిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే సురేశ్ రైనాతో కరచాలనం చేశాడు. అయితే ఆ తర్వాత రైనా కోరిక మేరకు అతడు మైదానం వీడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications