ధోనితో విభేదాలు లేవు: కోహ్లీ ‘శత్రువుల’ జాబితాపై స్మిత్ ఇలా
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన ఇద్దరు 'శత్రువుల' జాబితాలో తాను ఉన్నదీ, లేనిదీ తెలియదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఐపీఎల్ 10వ సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్‌గా ఎంపికైన స్టీవ్ స్మిత్ టీమ్ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నాడు.
ధర్మశాల టెస్టు అనంతరం ఆస్ట్రేలియన్లు ఇకపై తనకు స్నేహితులు కారని కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి స్మిత్‌తో పాటు ఆ జట్టులోని సభ్యులుగా ఉన్న రహానేతో పాటు ఇటీవలే జట్టులో చేరిన బెన్ స్టోక్స్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యలపై స్మిత్ స్పందించాడు. 'ఆ ఇద్దరు ఎవరు అనేది కోహ్లి తేల్చాల్సిన విషయం. అందులో ఉన్నానో లేదో తెలీదు. నా అభిప్రాయం ప్రకారం టెస్టు సిరీస్ ముగిసింది. భారత్ మాకన్నా మెరుగ్గా ఆడింది. ఇప్పుడు పుణే సూపర్ జెయింట్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టాను' అని స్మిత్ స్పష్టం చేశాడు.

ధోనితో విభేదాలు లేవు: కోహ్లీ
ధోనీని తొలగించి తనకు కెప్టెన్సీ ఇవ్వడంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని స్మిత్ తేల్చి చెప్పాడు. ఇప్పటికే తామిద్దరం సందేశాలు పంపుకున్నామని, ఐపీఎల్ గురించి చర్చించినట్లు స్మిత్ తెలిపాడు. 'ధోనీకి నాకు మధ్య ఎలాంటి వివాదాలు లేవు. నాతో సహా జట్టు సభ్యులందరితో ధోనీ క్రికెట్ సంబంధాలు సజావుగా ఉన్నాయి. కెప్టెన్‌గా నాకు చాలా మద్దతుగా నిలుస్తున్నాడు' అని స్మిత్ అన్నాడు.

నా సొంత నిర్ణయాన్ని దెబ్బతీస్తుందన్న స్మిత్
‘వివిధ దేశాల నుంచి అద్భుత ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇది నాకు అనుకూలంగా ఉంటుందే తప్ప అడ్డంకి కాబోదు. అయితే లీగ్‌లో ఎక్కువ మంది అభిప్రాయాలను తీసుకోను. ఇది నా సొంత నిర్ణయాన్ని దెబ్బతీస్తుంది' అని స్మిత్ చెప్పాడు. ఇక రహానే, తాను మంచి స్నేహితులమని స్మిత్ చెప్పుకొచ్చాడు.

గత సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి ఐదు మాత్రమే నెగ్గిన పూణె
గత సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే నెగ్గిన పూణె పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్ధానంలో నిలిచింది. దీంతో పదో సీజన్ కోసం జట్టు యాజమాన్యం ధోనిని తప్పించి స్మిత్‌ను కెప్టెన్‌గా చేసింది. ధర్మశాల ముగిసిన అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తనను బీరు పార్టీకి రమ్మని పిలిచినా వెళ్లలేదని చివరి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే తెలిపాడు.

స్మిత్ బీరు పార్టీపై రహానే
‘మా డ్రెస్సింగ్ రూమ్‌లో మేం సంబరాల్లో మునిగి ఉన్నాం. నేనక్కడే బిజీగా ఉన్నాను. సుదీర్ఘ సీజన్ తర్వాత మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇక నేను ప్రశాంతంగా ఉండడంతోనే నా ఉత్తమ ఆట బయటకు వస్తుంది. కోహ్లీ చాలా దూకుడుగా ఉంటాడు. అతడికి అదే బలం. ఇప్పుడు ఐపీఎల్‌పైనే నా దృష్టి ఉంది' అని రహానే అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications