For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1426: ఐపీఎల్‌లో మునాఫ్‌కు పునరాగమనం చేసేందుకు పట్టిన రోజులు

మునాఫ్ పటేల్ ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఆటగాడు. అయితే చక్రం గుండ్రంగా తిరిగినట్టు దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్‌కు దూరంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: మునాఫ్ పటేల్ ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఆటగాడు. అయితే చక్రం గుండ్రంగా తిరిగినట్టు దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్‌కు దూరంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు.

మునాఫ్ పటేల్ నాలుగేళ్ల తర్వాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున మునాఫ్ బరిలోకి దిగాడు. ఇలా సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన ఆటగాడిగా కూడా గుర్తింపు పొందాడు.

Munaf Patel Returns To Action After 1426 Days

మునాఫ్ పటేల్‌పై నమ్మకం ఉంచిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా తుది జట్టులోకి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసిన మునాఫ్ పటేల్ 35 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ జాస్ బట్లర్ వికెట్‌ను మునాఫ్ తీశాడు.

1426 రోజుల తర్వాత తొలి మ్యాచ్ ఆడినప్పటికీ మునాఫ్ పటేల్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు మునాఫ్ చివరి సారి 2013లో ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు మునాఫ్ పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.

మే 21వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మునాఫ్ మూడు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 32 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్ క్వాలిఫయిర్ 1లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగింది. ఈ ఏడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో మునాఫ్ పటేల్‌ను గుజరాత్ లయన్స్ జట్టు రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+