సింప్లీ సూపర్: ధోనితో ఉన్న ఆ బుడతడెవరు? (వీడియో)
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని ఓ సాధారణ ఆటగాడిగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తాజాగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూణె 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని క్రీజులోకి వచ్చినప్పుడు ధోని ధోని అంటూ స్టేడియం మొత్తం మోరుమ్రోగింది.
ఓ సాధారణ ఆటగాడిగా ఐపీఎల్‌లో ధోని ఆడుతున్నప్పటికీ అతడి చరిష్మా ఇప్పటికీ తగ్గలేదు. కెప్టెన్సీకి వీడ్కోలు పలికినా క్రికెట్ అభిమానులు ధోని అనే పేరుని మాత్రం ఇంకా మరిచిపోలేదు అన్నట్లుగా ఈడెన్ గార్డెన్స్‌లో ధోని ధోని అంటూ అభిమానులు అరుపులు కేకలు పెట్టారు.
35 ఏళ్ల ధోని తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఓ క్రికెటర్ కంటే కూడా మంచి వ్యక్తిగా ధోని బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కవ సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు.
సమయం దొరికినప్పుడు అభిమానులని కూడా కలుస్తున్నారు. తాజాగా ఐపీఎల్‌లో తన సహచర జట్టు ఆటగాడైన ఇమ్రాన్ తాహిర్ కుమారుడితో ఆడుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. పూణె విమానాశ్రయంలో ఓ అభిమాని ఈ వీడియోని తీశాడు.
ధోని సింప్లిసిటీని చూసిన అభిమానులు తమ తమ మొబైల్ ఫోన్స్‌లో ఈ వీడియోని బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో పూణె బౌలర్ ఇమ్రాన్ తాహిర్ కుమారుడితో ధోని సరదాగా ఆడుతున్నాడు.
రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఇనిస్టాగ్రామ్‌లో
పూణె బౌలర్ ఇమ్రాన్ తాహిర్ కుమారుడితో ధోని ఆడుతున్న వీడియోని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
ధోని అభిమాని ఇలా
పూణె విమానాశ్రయంలో ఇమ్రాన్ తాహిర్ కుమారుడితో ధోని ఇలా సరదాగా ఆడాడు.
ధోని - ఓ లెజెండ్
ధోని సింప్లిసిటీ అదుర్స్ అంటూ ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశాడు.
మరో అభిమాని ఇలా
ఇమ్రాన్ తాహిర్ కుమారుడితో ధోని ఇలా ఆడుతున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్ష్యం ధోనిది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications