హైదరాబాద్: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఏప్రిల్ 22న జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. ఏప్రీల్ 22న ఢిల్లీ, ముంబై జట్ల మధ్య సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు.
ఈ మ్యాచ్‌ని రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. దీంతో షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు జరగాల్సిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను సాయంత్రం 4 గంటలకు మార్చారు. ఢిల్లీ వేదికగా ఢిల్లీ, ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను మే 6న నిర్వహిస్తారు.

ప్రస్తుత షెడ్యూల్:
ఏప్రిల్ 22 (వేదిక ఢిల్లీ): ఢిల్లీ Vs ముంబై సాయంత్రం 4 గంటలకు
ఏప్రిల్ 22 (వేదిక పుణె): పుణె Vs హైదరాబాద్ రాత్రి 8 గంటలకు
కొత్త షెడ్యూల్:
ఏప్రిల్ 22 (వేదిక ముంబై): ఢిల్లీ Vs ముంబై రాత్రి 8 గంటలకు
ఏప్రిల్ 22 (వేదిక పుణె) : పుణె Vs హైదరాబాద్ సాయంత్రం 4 గంటలకు
మే 6 (వేదిక ఢిల్లీ) : ఢిల్లీ Vs ముంబై రాత్రి 8 గంటలకు