Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 10 ఎవరిది?: మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

హైదరాబాద్: క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం (మే 21) జరిగే ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ తుది పోరుకు వేదిక కానుంది.

ఈ సీజన్‌లో లీగ్‌ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్‌లో ఒకసారి ముంబైపై విజయం సాధించి పుణె రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు ఐపీఎల్ తుది పోరులో పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తోంది.

మూడోసారి గెలిచి రికార్డు సృష్టించాలని

మూడోసారి గెలిచి రికార్డు సృష్టించాలని

అంతేకాదు మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించాలనే కృతనిశ్చయంతో ముంబై జట్టు ఉంది. మరి పైనల్స్‌లో ముంబై మురుస్తుందా? పూణె మెరుస్తుందా? తెలియాలంటే ఇంకొన్ని గంటల్లో ఆగాల్సిందే. ముంబై ఇండియన్స్‌కి ఇది ఐపీఎల్‌లో ఇది నాలుగో ఫైనల్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా చూస్తే ఫైనల్లో ముంబై జట్టే ఫేవరెట్‌ అని చెప్పొచ్చు.

రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై

రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై

2013, 2015లలో ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ, పొలార్డ్‌, హర్భజన్‌ సింగ్, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లు ఇప్పుడూ జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. పార్థివ్‌ పటేల్‌, సిమన్స్‌ రూపంలో అనుభవజ్ఞులైన ఓపెనర్లు.. రోహిత్‌, రాయుడు, పొలార్డ్‌, కృనాల్‌, హార్దిక్‌ పాండ్యలతో కూడిన మిడిలార్డర్‌.. మెక్లెనగన్‌, మిచెల్‌ జాన్సన్‌, కర్ణ్‌శర్మ, బుమ్రా, మలింగల బౌలింగ్‌ దాడితో ముంబై పటిష్టంగా కనిపిస్తోంది.

స్మిత్‌కు ధోని సలహాలు

స్మిత్‌కు ధోని సలహాలు

ఇక పూణె విషయానికి వస్తే పుణే యాజమాన్యం కెప్టెన్‌గా తొలగించిందేమో గానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించలేకపోయింది. 2008 నుంచి 2015 వరకు ఆరు ఐపీఎల్‌ ఫైనల్స్‌ ఆడిన ధోనీకి ఇది ఏడో ఫైనల్‌. ఐపీఎల్‌లో తన అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలుస్తున్నాడు.

ఈ సీజన్‌లో ముంబైపై పూణె మూడు సార్లు విజయం

ఈ సీజన్‌లో ముంబైపై పూణె మూడు సార్లు విజయం

ఏడో ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పూణె విజయం సాధించడం ఖాయం. ఈ మ్యాచ్‌లో పూణె గనుక విజయం సాధిస్తే షేన్‌ వార్న్‌, గిల్‌క్రిస్ట్‌, వార్నర్‌ల తర్వాత ఐపీఎల్‌ ట్రోఫీ ఆందుకున్న ఆస్ట్రేలియన్‌ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ నిలుస్తాడు. అయితే లీగ్‌ దశలో రెండు సార్లు ముంబైపై గెలవడంతో పాటు తొలి క్వాలిఫయిర్‌లో విజయం సాధించి పూణె ఆత్మవిశ్వాసంతో ఉండగా, ముంబై మాత్రం ఒత్తిడిలో ఉంది. ఇరు జట్లు సమానంగా ఉండటంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మంచి రసపట్టుగా మారింది.

ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్ గురించి తెలుసుకోండి:

ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్ గురించి తెలుసుకోండి:

* హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి ఐపీఎల్ ఫైనల్ ఇదీ

* ముంబైకి ఇది నాలుగో పైనల్. 2010, 2013, 2015లలో చెన్నైతో పైనల్ ఆడింది. చివరి రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి విజయం సాధిస్తే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన జట్టుగా అవతరిస్తుంది.

* ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడనుండటం ఇది ఏడోసారి. ధోని నేతృత్వంలోని చెన్నై రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

* తేదీ, సమయం : మే 21 (ఆదివారం) at 20:00 IST

* వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్

* టీవీ లిస్టింగ్: సోనీ సిక్స్, సోనీ సిక్స్ HD, సోనీ ESPN, సోనీ ESPN HD, సెట్ మ్యాక్స్.

* ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Sony LIV, Hotstar

జట్లు (అంచనా):

రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌: రహానె, త్రిపాఠి, స్మిత్‌ (కెప్టెన్‌), ధోనీ (వికెట్‌ కీపర్‌), మనోజ్‌ తివారి, క్రిస్టియన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఫెర్గూసన్‌, జంపా, శార్దూల్‌ ఠాకూర్‌, ఉనద్కత్‌

ముంబై ఇండియన్స్‌: సిమన్స్‌, పార్థివ్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ (కెప్టెన్‌), రాయుడు, పొలార్డ్‌, కృనాల్‌, హార్దిక్‌, కర్ణ్‌శర్మ, బుమ్రా, మలింగ, మెక్లెనగన్‌/ జాన్సన్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+