హైదరాబాద్: పూణె వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పూణెకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసింది. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 16.1 ఓవర్లకే 108 పరుగులు చేసి ఆలౌటైంది.
ఏ దశలో కూడా ఢిల్లీకి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో 97 పరుగుల తేడాతో పూణెపై ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘన విజయం సాధించింది. అమిత్ మిశ్రా, జహీర్ ఖాన్‌లకు చెరో మూడు వికెట్లు లభించగా, కమిన్స్ రెండు, నదీమ్, క్రిస్ మోరీస్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఓటమి దిశగా సాగుతున్న పూణె
పూణె వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు ఓటమి దిశగా 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె లక్ష్య చేధనలో తడబడుతోంది. 11 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 54 బంతుల్లో 130 పరుగులు చేయాలి.
నలుపు ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన పూణె ఆటగాళ్లు
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి తండ్రి మృతికి సంతాప సూచకంగా ఆ జట్టు సభ్యులు నలుపు ఆర్మ్‌బ్యాండ్స్ ధరించారు. పూణె వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మనోజ్ స్థానంలో లోకల్ బాయ్ రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో చోటు కల్పించారు.
పూణె విజయ లక్ష్యం 206
ఐపీఎల్ 10వ సీజన్‌లో పూణె వేదికగా ఢిల్లీ-పూణెల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
దీంతో ఐపీఎల్ 10వ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో సిక్సుతో సెంచరీ చేసిన శాంసన్ ఆ మరుసటి బంతికే ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. స్పిన్నర్ జంపా వేసిన బంతిని భారీ షాట్‌గా ఆడబోయి శాంసన్ బౌల్డ్ అయ్యాడు.

జట్టు స్కోరు 2 వద్ద ఓపెనర్ ఆదిత్య తారెను డకౌట్ చేసి పూణెకు చాహర్ మంచి శుభారంభం అందించాడు. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ సామ్ బిల్లింగ్స్(24)ను స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బౌల్డ్ చేశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి పునాది వేశాడు.
యువ క్రికెటర్ రిషబ్ పంత్(31)తో కలిసి ఢిల్లీకి భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశాడు. వచ్చి రాగానే రిషబ్ భారీ షాట్లతో చెలరేగాడు. ఇక రిషబ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్ల)తో రాణించాడు. అయితే అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక చివర్లో క్రిస్ మోరిస్ విధ్వంసం సృష్టించాడు.
బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా సిక్సులు, ఫోర్లు బాదాడు. దీంతో 9 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. శ్యామ్ బిల్లింగ్స్ (24)పరుగులు చేశాడు.
పుణె బౌలర్లలో దీపక్ చహర్, ఇమ్రాన్ తహీర్, ఆడమ్ జంపా తలో వికెట్ తీయగా మయంక్ అగర్వాల్ చేతిలో రిషభ్ పంత్ రనౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో మంగళవారం పూణె సూపర్ జెయింట్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో పూణె జట్టు స్వల్ప మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విశ్రాంతి నిచ్చారు. కడుపు నొప్పి కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలను అజ్యింకె రహానే చేపట్టాడు.టాస్ గెలిచిన రహానే ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.
అయితే టాస్ వేసేటప్పుడు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్‌తో పాటు పూణె కెప్టెన్‌గా స్మిత్‌కు బదులుగా రహానే వచ్చాడు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ స్మిత్‌కు ఆరోగ్యం బాగోలేదని, కడుపు నెప్పి కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో తాను కెప్టెన్‌గా మారాల్సివచ్చిందని రహానె తెలిపాడు. ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ తమ జట్టులో ఒక మార్పు జరిగిందని, కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో బౌలర్ అండర్సన్ వచ్చాడని తెలిపాడు.
ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పూణె విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే తాను ఆడని తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు చేతిలో 15 పరుగులతో ఓటమి పాలైంది.
జట్ల వివరాలు:
రైజింగ్ పూణె సూపర్ జెయింట్: Steve Smith (captain), Mahendra Singh Dhoni (wicketkeeper), Ajinkya Rahane, Ben Stokes, Faf du Plessis, Usman Khawaja, Manoj Tiwary, Mayank Agarwal, Ankit Sharma, Baba Aparajith, Ankush Bains, Rajat Bhatia, Deepak Chahar, Rahul Chahar, Daniel Christian, Ashok Dinda, Lockie Ferguson, Jaskaran Singh, Saurabh Kumar, Milind Tandon, Jaydev Unadkat, Adam Zampa.
ఢిల్లీ డేర్ డెవిల్స్: Zaheer Khan (captain), Mohammad Shami, Shahbaz Nadeem, Jayant Yadav, Amit Mishra, Shreyas Iyer, Sanju Samson (wicketkeeper), Karun Nair, Rishabh Pant (wicketkeeper), CV Milind, Khaleel Ahmed, Pratyush Singh, Murugan Ashwin, Aditya Tare, Shashank Singh, Ankit Bawne, Navdeep Saini, Corey Anderson, Angelo Mathews, Pat Cummins, Kagiso Rabada, Chris Morris, Carlos Brathwaite, Sam Billings, Ben Hilfenhaus.