Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ 9: హైలెట్స్, ఐపీఎల్‌లో సత్తా చాటిన కేరళ యువ కెరటం

హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌లో కేరళ ఆటగాడు సంజూ శాంసన్ తొలి సెంచరీని నమోదు చేశాడు. మంగళవారం పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 5 సిక్సర్లు, 8 ఫోర్లతో 102 పరుగుల అతని అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ స్కోరు 200 దాటింది.

దీంతో ఐపీఎల్ 10వ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో సిక్సుతో సెంచరీ చేసిన శాంసన్ ఆ మరుసటి బంతికే ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. స్పిన్నర్ జంపా వేసిన బంతిని భారీ షాట్‌గా ఆడబోయి శాంసన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్‌ మోరీస్‌ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

Sanju Samson

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతికి అండర్స్‌న్‌ సింగిల్‌ తీశాడు. ఆ తర్వాతి ఐదు బంతులను ఆడిన మోరీస్‌ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 పరుగులు సాధించాడు. 9 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి ఢిల్లీని 205 పరుగులు దాటించడంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ ఓపెనర్ ఆదిత్య తారె డకౌట్‌గా వెనుదిరిగినా.. రెండో వికెట్‌కు సంజూ శాంసన్ 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఢిల్లీ Vs పూణె మ్యాచ్ హైలెట్స్:

* ఐపీఎల్‌లో 97 మ్యాచ్‌ల తర్వాత అజ్యింకె రహానే కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించాడు.
* 62 బంతుల్లో ఢిల్లీ ఆటగాడు సంజూ శాంసన్ తన తొలి ఐపీఎల్ సెంచరీని సాధించాడు.
* ఐపీఎల్ 10వ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ గుర్తింపు పొందాడు.
* మనీష్ పాండే తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయుస్కుడిగా సంజూ శాంసన్ గుర్తింపు పొందాడు.
2009లో సెంచరీ సాధించిన మనీష్ పాండే (అప్పుడు 19 ఏళ్లు) పిన్న వయస్కుడు కాగా తర్వాత స్థానంలో శాంసన్ నిలిచాడు.
* ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన 28వ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.
* క్రిస్ మోరిస్ 9 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
* పూణెతో క్రిస్ మోరిస్ 422.22 స్ట్రయిక్ రేట్ ని నమోదు చేశాడు.
* ఐపీఎల్‌లో ఎక్కువ బంతులను (49) మంగళవారం నాటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎదుర్కొన్నాడు. అంతకముందు 2016లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 48 బంతులను ఎదుర్కొన్నాడు.
* ఈ మ్యాచ్‌కి ముందు టీ20లో సంజూ శాంసన్ అత్యధిక స్కోరు 87. 2015-16 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ పై ఈ స్కోరు సాధించాడు.

Match 9: Highlights: Delhi (DD) Vs Pune (RPS) Kerala youngster Sanju Samson's maiden T20 century helped Delhi Daredevils (DD) post a mammoth 205/4 against Rising Pune Supergiant (RPS) in an Indian Premier League 2017 match at the Maharashtra Cricket Association Stadium here on Tuesday (April 11).

* ఈ మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ అద్భుత ప్రదర్శన చేసి పర్పెల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు.
* చివరిసారిగా ఢిల్లీ ఢేర్ డెవిల్స్ 2012లో 200 పరుగులు సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కేవలం మూడు సార్లు మాత్రమే ఢిల్లీ 200కు పైగా పరుగులు సాధించింది.
* చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ 76 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే మూడో అత్యధిక స్కోరు. అంతకముందు ఆర్సీబీ 89, 77 పరుగులు చేసింది.
* ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా టీ20 చరిత్రలోనే ఓ చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు.
Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+