For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుజరాత్‌కు షాక్: చెలరేగిన వార్నర్-హెన్రిక్స్, హైదరాబాద్ మరో గెలుపు

ఐపీఎల్ 10వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మరో విజయం సాధించింది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మరో విజయం సాధించింది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

వార్నర్ (76), హెన్రిక్స్ (52) అద్భుతంగా ఆడి, హైదరాబాదును గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత హైదరాబాద్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 140 పరుగులు చేసింది.

హైదరాబాద్ బ్యాటింగ్

- వార్నర్ 45 బంతుల్లో 76 పరుగులు, హెన్రిక్స్ 39 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిపోయారు. దీంతో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలిచింది.
- గుజరాత్ తమ ముందుంచిన లక్ష్యాన్ని హైదరాబాద్ సులభంగా చేధించింది. కేవలం 15.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 140 పరుగులు చేసింది. గుజరాత్ 135 పరుగులే చేసింది.
- 5 ఓవర్లు ముగిసేసరికి 48 పరుగులు చేసింది.
- డేవిడ్ వార్నర్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు.
- నాలుగో ఓవర్ 1వ బంతికి ధావన్ అవుటయ్యాడు. అతను 9 బంతుల్లో 1 సిక్సుతో 9 పరుగులు చేశాడు.
- శిఖర్ ధావన్ - వార్నర్ ఓపెనర్లుగా వచ్చారు.

గుజరాత్ బ్యాటింగ్

- గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
- 17.5 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
- 18వ ఓవర్ 4వ బంతికి కులకర్ణి రన్ అవుటయ్యాడు. 2 బంతుల్లో 1 పరుగు చేశాడు.
- 18వ ఓవర్ రెండో బంతికి కార్తీక్ అవుడయ్యాడు. అతను 32 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.
- తొలి పది ఓవర్లలో 60 పరుగులు చేసిన గుజరాత్.. ఆ తర్వాత ఏడు ఓవర్లలో 53 పరుగులు చేసింది.
- 17వ ఓవర్ నాలుగో బంతికి స్మిత్ అవుటయ్యాడు. స్మిత్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేశాడు.
- 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ కేవలం 60 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది.
- తొమ్మిదో ఓవర్ చివరి బంతికి రైనా అవుటయ్యాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేశాడు.
- ఏడో ఓవర్ రెండో బంతికి ఫించ్ అవుటయ్యాడు. అతను 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
- గుజరాత్ ఆరు ఓవర్లకు 40 పరుగులు చేసింది.
- జేజే రాయ్ ఆరో ఓవర్ 2వ బంతికి అవుటయ్యాడు. అతను 21 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. అప్పటికి గుజరాత్ స్కోర్ 37.
- గుజరాత్ స్కోర్ 35 పరుగుల వద్ద ఉన్నప్పుడు మెకల్లమ్ అవుటయ్యాడు. 10 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+