పంజాబ్ చెత్త ఆట: పుణే గెలుపు, క్వాలిఫయర్‌లో ముంబైతో ఢీ
పుణే: ఐపీఎల్ కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. గత ఏడాది పేలవ ఆట తీరు ప్రదర్శించిన పుణే.. ఈసారి అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచులో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచింది.
పుణె ఎంసీఏ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 73 పరుగులు చేసింది. పుణే ముందు 74 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని సునాయాసంగా ఛేదించింది.

ఇంకా ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్లతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఓపెనర్ రహానె (34 బంతుల్లో 1×4, 1×6తో 34 పరుగులు), స్టీవ్ స్మిత్ (18 బంతుల్లో 15 పరుగులు) చేశారు.
రాహుల్ త్రిపాఠి 28; 20 బంతుల్లో 2×4, 1×6తో 28 పరుగులు చేశాడు. పంజాబ్ పైన గెలిచిన పుణే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications