For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: బరిలో నిలిచిన సన్‌రైజర్స్, ఖాయమైన ప్లేఆఫ్‌ బెర్త్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌తో తలపడుతుంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సమష్టిగా పోరాడి విజయం సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు), విజయ్ శంకర్ (44 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు)తో అర్ధ సెంచరీలతో రాణించడంతో గుజరాత్ లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.

తాజా విజయంతో 8 విజయాలను సాధించిన సన్‌రైజర్స్ 17 పాయింట్లతో (బెంగళూరు మ్యాచ్‌ రద్దుతో 1 పాయింట్‌ కలిపి) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

SRH win toss and elect to field first

155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 25 పరుగులకే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (18), హెన్రిక్స్‌ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ (52 బంతుల్లో 69; 9 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ చివరి వరకూ సంయమనంతో ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరూ 15.1 ఓవర్లలో మూడో వికెట్‌కి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. వార్నర్‌తో పాటు విజయ్‌ శంకర్‌ (44 బంతుల్లో 63; 9 ఫోర్లు) అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో తొలి అర్ధ సెంచరీ చేశాడు.

రెండో వికెట్‌కు వీరిద్దరి జోడీ 133 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అంకిత్ సోని బౌలింగ్‌లో తొలి బంతినే బౌండరీ బాదిన వార్నర్ సన్ రైజర్స్‌కు విజయాన్ని అందించాడు.

హైదరాబాద్ విజయ లక్ష్యం 155

కాన్పూర్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు 155 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 61; 5x4, 4x6), డ్వేన్‌స్మిత్ (33 బంతుల్లో 54; 7x4, 2x6) అర్ధసెంచరీలతో రాణించారు.

వీరిద్దరి జోడీ తొలి ఓవర్ నుంచే బౌండరీల మోత మోగించడంతో గుజరాత్ స్కోరు బోర్డు దూసుకెళ్లింది. స్పిన్నర్, పేసర్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.

 SRH win toss and elect to field first

హైదరాబాద్ బౌలర్లని వీరిద్దరి జోడీ సమర్ధవంతగా ఎదుర్కొవడంతో 111 పరుగుల వరకు హైదరాబాద్ తొలి వికెట్‌ తీయలేకపోయింది. ఈ దశలో ఇన్నింగ్స్ 10.5వ బంతికి డ్వేన్ స్మిత్‌ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి రషీద్ ఖాన్ హైదరాబాద్‌కి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగి 12 బంతుల్లోనే 4 వికెట్లు తీశారు.

గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా (2), దినేశ్ కార్తీక్ (0), అరోన్ ఫించ్ (2)‌తో పాటు అప్పటి వరకు నిలకడగా ఆడిన ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా వరుసగా అవుట్ కావడంతో గుజరాత్ కేవలం 12 పరుగుల వ్యవధిలోనే 5 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 20; 2x4) ఒక ఎండ్‌లో చివరి వరకూ పోరాడాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫాల్కనర్ (8), శాంగ్వాన్ (0), ప్రవీణ్ కుమార్ (1), అంకిత్ సోని (0), మునాఫ్ పటేల్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌ (4/32) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత చక్కటి బంతులతో గుజరాత్‌ను కట్టడి చేశాడు.

 SRH win toss and elect to field first

హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ షిరాజ్ 4 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ మూడు, భువనేశ్వర్ కుమార్ రెండు, సిద్ధార్థ కౌల్ ఒక వికెట్ తీశారు.

యువీకి విశ్రాంతి, గుజరాత్‌‌పై సన్‌రైజర్స్ ఫీల్డింగ్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌తో తలపడుతుంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్ బెర్తె లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది.

గాయం కారణంగా యువరాజ్ సింగ్‌ స్థానంలో దీపక్ హుడాకి తుది జట్టులో చోటు కల్పించారు. ఇక గుజరాత్ విషయానికి వస్తే ధావళ్ కులకర్ణి, థంపీ స్థానంలో ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్‌ని తుది జట్టులోకి తీసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా నాలుగు సార్లూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టునే గెలిచింది.

IPL 2017: Match 53: SRH win toss and elect to field first

ఈ సీజన్‌లో ఇప్పటివరకు సన్ రైజర్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడింట విజయం సాధించగా, ఐదింట పరాజయం పాలైంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దీంతో 15 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. దీంతో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తప్పనిసరిగా విజయం సాధించాలి.

లేకపోతే ఆదివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై పుణే విజయం సాధిస్తే నాలుగో జట్టుగా ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో నాకౌట్‌ బెర్త్‌ కోసం అంతవరకు వేచి చూడకుండా గుజరాత్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని వార్నర్ సేన భావిస్తోంది

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:

డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, హెన్రిక్యూస్, విజయ్ శంకర్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, నమన్ ఓజా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షిరాజ్

గుజరాత్ లయన్స్:
డ్వేన్‌స్మిత్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, అరోన్ ఫించ్, రవీంద్ర జడేజా, జేమ్స్ ఫాల్కనర్, ప్రదీప్ శాంగ్వాన్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్, అంకిత్ సోని

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+