Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: కోల్‌కతాపై పంజాబ్ విజయం, ప్లే ఆఫ్ ఆశలు సజీవం

హైదరాబాద్: మొహాలి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో క్రిస్‌లిన్‌ (52 బంతుల్లో 84; 8×4, 3×6) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్‌ తివాటియా అద్భుత ప్రదర్శన (2/18)తో పంజాబ్‌ విజయం సాధించింది.

కోల్‌కతా విజయ లక్ష్యం 168

మొహాలిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాజ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా విజయ లక్ష్యం 168 పరుగులుగా నిర్దేశించింది.

పంజాబ్ జట్టులో కెప్టెన్ మ్యాక్స్ వెల్ (25 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాటు సాహా (33 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.

 Kolkata Knight Riders win the toss and elect to field

తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ (16 బంతుల్లో 12), మనన్‌ వోహ్రా (16 బంతుల్లో 25) తొలి మూడు ఓవర్లు సింగిల్స్‌ తీస్తూ అప్పుడప్పుడూ బౌండరీలు బాదారు. అయితే పవర్‌ప్లే ముగిసే క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు.

జట్టు స్కోరు 39 వద్ద వోహ్రా, 41 వద్ద గుప్తిల్‌ అవుటవ్వడంతో పంజాబ్ తడబడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షాన్‌మార్ష్‌ (11) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న సాహా (33 బంతుల్లో 38) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌ దూకుడగా ఆడటంతో పంజాబ్ తిరిగి గాడిలో పడింది. సాహా సహకారం మ్యాక్స్ వెల్ సిక్సర్లతో విరుచకుపడటంతో కింగ్స్ స్కోరులో వేగం పెరిగింది. గ్రాండ్‌హోం వేసిన 12వ ఓవర్లో మాక్స్‌వెల్‌ రెండు భారీ సిక్సర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి.

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన మాక్స్‌వెల్‌ మూడో బంతికి వోక్స్‌ చేతికి చిక్కాడు. నాలుగో వికెట్‌గా మ్యాక్స్‌వెల్ అవుటైన తరువాత సాహా మోస్తరుగా రాణించాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమవడంతో స్టంపౌటయ్యాడు.

చివర్లో రాహుల్ తివాతియా(15 నాటౌట్;8 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్‌, క్రిస్‌ వోక్స్‌ తలో రెండు వికెట్లు తీయగా ఉమేశ్‌యాదవ్‌, నరైన్‌ చెరో వికెట్‌ తీశారు.

పంజాప్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మొహాలిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.షెల్డన్‌, పీయూష్‌ చావ్లా స్థానాల్లో రాబిన్‌ ఉతప్ప, కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.

టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఎనిమిదింట్లో గెలుపొంది ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. గత మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఓపెనర్లు క్రిస్‌లిన్, సునీల్ నరైన్ భీకర ఫామ్‌ని కొనసాగించి పవర్‌ ప్లేలోనే 105 పరుగులు చేసి కోల్‌కతాకి విజయం అందించారు.

మరోవైపు పంజాబ్ ఆటగాడు ఆమ్లా సెంచరీ చేసినా గుజరాత్ చేతిలో పేలవ బౌలింగ్ కారణంగా పంజాబ్ ఓటమి చవిచూసింది. దీంతో టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

పదో సీజన్‌లో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్
C Lynn, S Narine, G Gambhir, R Uthappa, M Pandey, Y Pathan, C de Grandhomme, C Woakes, U Yadav, K Yadav, A Rajpoot

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
M Vohra, M Guptill, S Marsh, G Maxwell, W Saha, A Patel, R Tewatia, M Henry, M Sharma, Sandeep Sharma, S Singh

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+