
ఏమైందీ జట్టుకి..
అసలు ఈ జట్టుకు ఏమైందని సందేహిస్తున్నారు. సుడిగాలిలా విజృంభించే క్రిస్ గేల్.. ఈ సీజన్ మొత్తమ్మీద ఆడింది ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్. గుజరాత్ లయన్స్ జట్టు మీద రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడితే ఒక దాంట్లో డకౌట్, మిగిలిన వాటిలో డబుల్ డిజిట్‌కు వెళ్లింది కేవలం రెండు సార్లు మాత్రమే. అది కూడా మరీ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కావు.

అంతంత మాత్రమే..
ఒకటి ముంబై ఇండియన్స్ మీద 22, మరోటి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 32.. మిగిలిన మ్యాచ్‌లలో గేల్ స్కోర్లు 8, 7, 6. కోహ్లీ కొంత పర్వాలేదనిపించినా దానివల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. కోల్‌కతా మీద మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. పంజాబ్ జట్టు మీద కేవలం 6 పరుగులే చేసి సందీప్ శర్మ చేతిలో ఔటయ్యాడు. మిగిలిన వాటిలో కూడా 10, 20, 28 పరుగులు చేశాడు. రెండుసార్లు మాత్రం అర్ధసెంచరీలు కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి.

హిట్టర్లున్నారు.. కానీ..
శుక్రవారం నాటి మ్యాచ్‌లో 138 పరుగులకే పంజాబ్ జట్టును కట్టడి చేయడంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బెంగళూరు జట్టు గెలుస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, సొంత మైదానం అయినా.. ఎదురుగా ఉన్నది అతి సాధారణ లక్ష్యమే అయినా కూడా బెంగళూరు ఆటగాళ్లు తడబడ్డారు. జట్టులో ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే కావడం గమనార్హం.

ఇక వచ్చే ఐపీఎల్‌పైనే ఆశలు
గేల్, కోహ్లీ, డివీలియర్స్ ముగ్గురినీ సందీప్ శర్మే ఔట్ చేయడం విశేషం. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురు ప్రముఖ బ్యాట్స్‌మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అతడు గుర్తింపు పొందాడు. కాగా, అత్యధిక ఓటములు మూటగట్టుకున్న పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు మీద ఆశలు పెట్టుకోవడం అనవసరమని.. కనీసం వచ్చే సీజన్‌కైనా కాస్తా ప్రిపేర్ అయితే బాగుంటుందని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











